»   » ఓహ్..! ఈ పోస్టర్లు చూసారా? ఖచ్చితంగా బిచ్చగాడు కంటే పెద్ద హిట్టే

ఓహ్..! ఈ పోస్టర్లు చూసారా? ఖచ్చితంగా బిచ్చగాడు కంటే పెద్ద హిట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్ర‌చారంలో కొత్త ఒర‌వ‌డి, అసాధార‌ణ‌మైన కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవ‌లి కాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన అనువాద చిత్రం బిచ్చ‌గాడు నేర్పిన పాఠ‌మిది. ఓ అనువాద చిత్రం ఈ స్థాయి విజ‌యం సాధించిందంటే నిర్మాత‌లు చేసిన అద్భుత ప్ర‌చార‌మే అందుకు కారణం. ఓ స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ చేశారు నిర్మాత‌లు.

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. కేవ‌లం కోటిన్న‌రతో తెర‌కెక్కి 25 కోట్లు పైగా వ‌సూళ్లు సాధించిన రేర్ మూవీ ఇది. 50 థియేట‌ర్ల నుంచి 200 థియేట‌ర్ల‌కు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. ఈ స్థాయి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మ‌రో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు.

ఆన్ మ‌రియ క‌లిప్పిలాను:

ఆన్ మ‌రియ క‌లిప్పిలాను:

మ‌ల‌యాళంలో ఇటీవ‌ల రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన‌ `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` చిత్రాన్ని తెలుగులో అందించ‌నున్నారు. `ఓకే బంగారం` ఫేం దుల్కార్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా..

నాన్న లో కనిపించిన పాపే:

నాన్న లో కనిపించిన పాపే:

`నాన్న‌` (విక్ర‌మ్ సినిమా) చిత్రంలో క్యూట్ అప్పియ‌రెన్స్‌, చ‌క్క‌ని పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్న బేబి సారా అర్జున్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. మిథున్ మాన్యూల్ థామ‌స్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్:

మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్:

ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రం మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో తెలుగు అనువాద హ‌క్కుల కోసం భారీ పోటీ ఏర్ప‌డింది.

ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం:

ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం:

పోటీలో ఫ్యాన్సీ రేటు చెల్లించి రిలీజ్ హ‌క్కుల్ని ద‌క్కించుకున్నారు. ఓ ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌న్న‌దే సినిమా.

స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌:

స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌:

థామ‌స్ ఓ సింపుల్ స‌బ్జెక్ట్‌ని రియ‌లిస్టిక్ పంథాలో ఆవిష్క‌రిస్తూనే... స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా తెర‌కెక్కించారని మ‌ల్లూవుడ్‌లో క్రిటిక్స్ ప్ర‌శంసించారు.

రికార్డ్ వ‌సూళ్లు సాధించింది:

రికార్డ్ వ‌సూళ్లు సాధించింది:

కేర‌ళ‌లో 70 పైగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం రికార్డ్ వ‌సూళ్లు సాధించింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిద‌ని మ‌ల‌యాళ యంగ్ హీరో, సూప‌ర్‌స్టార్ దుల్కార్ స‌ల్మాన్ ప్ర‌శంసించ‌డం విశేషం.

అరుదైన చిత్రం:

అరుదైన చిత్రం:

50 థియేట‌ర్ల నుంచి 200 థియేట‌ర్ల‌కు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంప‌ర్ హిట్ కొట్టిన బిచ్చగాడు స్థాయి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మ‌రో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు.

English summary
One another block buster Malayalam Movie Dubbed to Telugu from the producers of Bicchagadu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu