మామ, అల్లుడిని మేనేజ్ చేస్తున్న సెక్సీ లేడీ!
సినిమా రంగంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సక్సెస్ ఉన్నప్పుడు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వరుస భారీ హిట్లతో మంచి జోరుమీద ఉన్న కరీనా కపూర్ కూడా ఇప్పుడు బాలీవుడ్లో బిజీ హీరోయిన్. 3 ఇడియట్స్, బాడీగార్డ్, రా.వన్ వరుస విజయాలు ఆమెను వరించాయి. తాజాగా మాధుర్ బండార్కర్ 'హీరోయిన్' సినిమాతో పాటు, సైఫ్ తో కలిసి 'ఏజెంట్' వినోద్ సినిమాతో పాటు....అమీర్ ఖాన్‌తో 'తలాష్', అమీర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో 'ఏక్ మెయిన్ ఔర్ ఏక్ తు' సినిమాల్లోనూ లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
కాకతాళీయంగా....ఈ రెండు సినిమాల షూటింగులు ఒకేసారి జరుగుతున్నాయి. దీంతో ఇటు మామ, అటు అల్లుడు అసంతృప్తికి గురి కాకుండా ఇద్దరినీ మేనేజ్ చేస్తోంది సెక్సీ లేడీ కరీనా. ఇద్దరు మామా, అల్లుల్లే కాబట్టి హీరోయిన్ కరీనాతో అడ్జెస్ట్ అయి పని కానిచ్చేస్తున్నారు. అదే వేర్వేరు హీరోలు అయితే పరిస్థితి వేరేలా ఉండేదేమో?
కరీనా ఇప్పటికే 3 ఇడియట్స్ సినిమాలో అమీర్ తో నటించి భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇమ్రాన్ తో మాత్రం కరీనాకు ఇదే తొలి సారి. ఇద్దరితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ....వేర్వేరు వయసున్న మామా-అల్లుళ్లని మేనేజ్ చేస్తుండటం కూడా టాలెంటే మరి!


Click it and Unblock the Notifications











