రొమాంటిక్ కామెడీగా.. మామ రెండు జెగ్గులు!
మామ రెండు జెగ్గులు చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. హీరోయిజం మూవీ కాదు ఇది జీరోయిజం అనే ఉపశీర్షిక. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆగస్టు 24న మధ్యాహ్నం ఫిలింఛాంబర్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయి.
జెడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూతన నటీనటులు సురేష్ పాని, మేఘన హీరో, హీరోయిన్‌గా నటించనుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు నిర్మాతలు ప్రసన్నకుమార్, కూచిపూడి వెంకట్, డైరెక్టర్ సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎక్స్ యాక్సెస్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు.

ఊర మాస్ అబ్బాయికి, స్వచ్చభారత్‌కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఓ క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిజాన్ని మాత్రమే చూసిన ప్రేక్షకులు ఇప్పుడు జీరోయిజాన్ని చూస్తారు అని దర్శకుడు జేడీ అన్నారు. ఈ చిత్రం త్వరలో షూటింగ్‌ను ప్రారంభించి నవంబర్, డిసెంబర్‌లో విడుదల చేస్తామన్నారు.
నటీనటులు:
సురేష్ పాని, మేఘన
స్టోరీ స్క్రీన్ ప్లే : సుబ్రమణ్యం
మాటలు: సుబ్రమణ్యం, జెడి, ధరణి కోట,
కెమెరా: ఆర్య
మ్యూజిక్ : త్రినాథ్
పాటలు: మౌనశ్రీ మల్లిక్
సాంకేతిక నిపుణులు:
అడిషనల్ స్క్రీన్ ప్లే , దర్శకుడు: జేడీ
నిర్మాత: చింతల జె ఎస్ కుమార్( జోషి )
బ్యానర్: ఎక్స్ యాక్సెస్ క్రియేషన్స్


Click it and Unblock the Notifications











