ఇస్లాంలోకి మరో హీరోయిన్, భర్తకు శిక్ష తగ్గించారు!
ముంబై: ఈ మధ్య సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు మతం మార్చుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది సంగీత దర్శకుడు యువన్ శంకర రాజా ఇస్లాం స్వీకరించారు. తాజాగా మతం మార్చుకుంటున్న సినీ తారల లిస్టులో నిన్నటితరం బాలీవుడ్ అందాల తార మమతాకులకర్ణి చేరరు.
90వ దశకంలో బాలీవుడ్‌ను తన హాట్ అండ్ సెక్సీ అందాలతో ఊర్రూతలు ఊగించిన ఘనత మమత కులకర్ణి సొంతం. అప్పట్లో దాదాపు 11 ఏళ్ల పాటు ఆమె తన హవా కొనసాగించారు. అయితే ఆ తర్వాత హోటల్ వ్యాపారానికి పరిమితం అయి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. తాను ఇష్ట పూర్వకంగా ఇస్లాం మతం స్వీకరించారనని మమత కుల కర్ణి తెలిపారు.

మమత కులకర్ణితో పాటు ఆమె భర్త వీకీగోస్వామి కూడా ఇస్లాంమతం స్వీకరించారు. భర్త కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మమత కుల కర్ణి, వికీగోస్వామి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. వీకీ గోస్వామిని 1997లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడగా...ఇస్లాం మతంలోకి మారడంతో శిక్ష తగ్గించి 2012లో విడుదల చేసారు.
వీకీ గోస్వామి జైలుకు వెళ్లిన తర్వాత ఆయన హోటల్ వ్యాపారాన్ని ఆమె ప్రియురాలు మమత కులకర్ణి చూసుకుంటూ వస్తున్నారు. ఆయన జైలు నుండి విడుదలైన తర్వాత గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ ప్రస్తుతం కెన్యాలోని నైరుబీలో నివాసముంటున్నారు.


Click it and Unblock the Notifications