»   » మమతా మోహన్ దాస్..తప్పు రిపీట్ చేసింది...

మమతా మోహన్ దాస్..తప్పు రిపీట్ చేసింది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున పిలిచి కోరి మరీ కేడీలో వేషమిచ్చాడని మురిసిపోయినంత సేపు పట్టలేదు మమతా మోహన్ దాస్ పరిస్దితి. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఏం చేయాలో తోచని సందిగ్ధ పరిస్దితిలో పడిపోయింది. తప్పు చేసాను...ఇక నుంచైనా జాగ్రత్తగా క్యారెక్టర్స్ ఎన్నుకుని చేస్తాను అని డిసైడ్ చేసుకున్న ఆమెకు అస్సలు కథలు చెప్పే వారు కరువయ్యారు. కేడీలో ఆమె చేసిన జానికి క్యారెక్టర్ కు నెగిటివ్ గా మార్కులు పడ్డాయి. పెళ్ళై భర్త చనిపోతే...పిల్లాడిని పట్టుకుని హీరో వద్దకు చేరిన పాత్ర వినటానికి ఉదాత్తంగా కనిపించినా డబ్బులు పుచ్చుకుని ధియోటర్ కి వచ్చే మాస్ ప్రేక్షకుడికి రుచించలేదు. అందులోనూ కేడీ ఉషారులో ఆమె రెచ్చిపోయి నేను గాయకురాలను కాదు...నటిని మాత్రమే అని స్టేట్ మెంట్స్ ఇవ్వటం కూడా ఆమె కొంప ముంచిందంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్ లాంటి వారు సైతం ఆమె చేత పాడించటానికి ముందుకు రావటం లేదు. నాగార్జున చేరదీసిన అనూష్క ఎక్కడికో వెళ్ళింది..నా పరిస్ధితి ఏమిటి ఇలా అయ్యిందంటూ దగ్గర వారి దగ్గర వాపోతోంది. ఇంతకు ముందు విక్టరీ వంటి చిత్రాలు ఒప్పుకుని తప్పు చేసాను అనుకున్న ఆమెకు మళ్లీ అదే తప్పు రిపీట్ అయిందని చెప్తోంది. అయితే తెలివిగా పూర్తి స్ధాయి తెరకు దూరం కాకుండా నా డేట్స్ ఉన్నాయంటూ...మళయాళ నిర్మాతలకు కబుర్లు పంపి...ఎడాపెడా మళయాళ చిత్రాలు ఒప్పుకునేందకు సన్నాహాలు చేస్తోంది. అక్కడ గ్యాప్ తర్వాత రావటంతో తెలుగు పరిశ్రమలో వెలుగు వెలిగిందంటూ మళయాళ పత్రికల్లో రాయటం ఆమెకు కలిసి వస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu