షారుక్ కే నో చెప్పా మీరెంత? తెలుగు హీరోయిన్
షారుక్ ఖాన్‌తో సినిమా చేయమని దర్శకురాలు ఫరాఖాన్ నన్నడిగారు. నిజంగా ఇది చాలా మంచి అవకాశం. అయితే నేను కాకుండా ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలిసి వెనక్కి తగ్గాను అంటూ గర్వంగా చెప్తోంది..మమతా మోహన్ దాస్. షారూఖ్ ఖాన్ తో సినిమా చేయటమే గ్రేట్ అని కాకుండా షారూఖ్ అంతటి వాడిని రిజెక్టు చేసానని గొప్పగా పనిగట్టుకుని మీరీ చెప్పటం ఏమిటని కొందరు ఆలోచనలో పడ్డారు. దానికి రీజన్ తొందరలోనే దొరికింది. మమతాకు తెలుగులో ఇద్దరి హీరోయిన్స్ లో ఒకరిగా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చేయలేను..అని చెప్పలేక డేట్స్ ఖాళీలేవు..మళయాళంలో బిజీ అని చెప్పి వాటినుంచి తప్పించుకుంటోంది. దాంతో ఈ బెడద నుంచి తప్పించుకోవాలని ఇలా ప్రచారం మొదలెట్టింది అంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ అంటే షారూఖ్ అంతటి వారికే నో చెప్పా..మీరెంత అని ఆలోచించుకోమని ఆఫ్షన్ ఇవ్వటానికే ఈ కొత్త స్కీమ్ అంటున్నారు. మొదట ఏదో వేషం పట్టుకుంటే తర్వాత మొల్లిగా బిజీ కావచ్చు కదా..అని సీనియర్స్ ఈమెకు సలహా ఇస్తున్నారు. అదీ సంగతి. మమతామోహన్ దాస్ ప్రస్తుతం నాగార్జున తో కలిసి కేడీ చిత్రంలో చేస్తోంది. అంతకు మించి ఆమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు.


Click it and Unblock the Notifications











