కొంతమంది పనిగట్టుకుని తనకూ రామానాయుడు మనవడు రాణాకీ సంభందం అంటగడుతున్నారంటూ వాపోతోంది మమతా మోహన్ దాస్. ఈ మధ్యన వీరిధ్దరి మధ్యన ఎఫైర్ నడుస్తున్నట్లు వచ్చిన వార్తలను రూమర్స్ అంటూ కొట్టిపాడేసింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..రాణా ఒక్కడితోనే కాదు..ఓ మళయాళ నిర్మాత కుమారుడుతోను సంభందం అంటగడుతూ నాపై రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. మీకు తెలుసా ఆ కుర్రాడు వయస్సు కేవలం పదిహేనేళ్ళ మాత్రమే. అయినా ఈ జనాలకి వేరే పనేమీ ఉండదా నేను ఎవరితో తిరుగుతున్నానో ఎంక్వైరీ చేస్తూ లింక్ లు పెట్టడానికి అంటూ విరుచుకుపడింది. నాకు రాణాతో కాదు మరెవరూతూనే సంభందం లేదు..నేను స్పష్టంగా చెప్పుతున్నాను అంది.