ఫ్యాన్సీ నెంబర్స్: మమతా మోహన్ దాస్ పెళ్లి-విడాకులు
హైదరాబాద్: 12/12/12... స్పెషల్ డే రోజున హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా వార్తల్లోక్కింది. అయితే ఇదేదో సంతోషించదగ్గ విషయం మాత్రం కాదు. ఎందుకంటే ఆమె ఈ రోజు తన విడుకులపై నిర్ణయం తీసుకుంది. సంవత్సరం తిరక్కముందే మమతా మోహన్ దాస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభిమానులను షాక్ కు గురి చేసింది.
తన చిన్ననాటి స్నేహితుడు పద్మనాభన్ ని గత ఏడాది 11/11/11 తేదీని పెళ్లి చేసుకున్న కథా నాయిక సర్గిగా ఏడాది తిరిగే లోపే విడాకులుక సిద్ధం అయింది. ఈ మేరకు మీడియా ప్రకటన కూడా చేసింది. "మా ఇద్దరి మనస్తత్వాలు వేరని మా ఇద్దరికీ అర్ధమైపోయింది. అలాంటప్పుడు కలిసి కాపురం చేయలేమని నిశ్చయించుకున్నాం. అందుకే, విడాకులు తీసుకోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. అందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది" అని మమత మోహన్ దాస్ వెల్లడించింది.
26 సంవత్సరాల మమత సింగర్ గా కెరీర్ ప్రారంభించి 2005లో 'మాయోక్కమ్' అనే మలయాళ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది. తెలుగు, తమిళం, మలయాళం కలిపి మమత ఇప్పటి వరకు 30 చిత్రాల్లో నటించింది. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, చింతకాయల రవి, కింగ్, కేడీ తదితర చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications












