ఇంకా చీరలు కట్టలేదట!!!
చీరలంటే ఇష్టమా కాదా అంటే ఇపుడే చెప్పనంటోంది సింగర్ కమ్ యాక్టర్ మమతా మోహన్ దాస్. ఇప్పటికయితే మాడ్రన్ డ్రెస్ లంటేనే ఇష్టమని చెబుతోంది. అవును మరి యమదొంగలో లంగా జాకెట్ లో కనపడి కస్సుమనిపించిన మమతామోహన్ దాస్ ఇప్పుడే చీరలు కట్టదంటమరి. ఈ విషయాలు మోహన్ బాబు భార్య చీరల దుకాణం తాన్యా రీఓపెనింగ్ లో చెప్పింది. విష్ణుతో సినిమా చేస్తున్న మమతా మోహన్ దాస్ చీరల దుకాణం రీఓపెనింగ్ కు చీరకట్టకుండా మాడ్రన్ డ్రెస్ లో వెళ్లింది. ఇంకా ఈ కార్యక్రమానికి జయసుధ, ప్రేమ తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











