ధూమ్‌ధామ్‌గా మమతా మోహన్‌దాస్ పెళ్లి
సినీ నటి మహతా మోహన్ దాస్ వివాహం ప్రాజిత్ పద్మనాభన్‌తో బుధవారం కేరళలో ఘనంగా జరిగింది. కోజికోడ్ లోని ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు మమత సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. మమత భర్త బెహ్రెయిన్‌లో పెద్ద వ్యాపారస్తుడు. నవంబర్లో ఈ జంట ఎంగేజ్‌మెంట్ ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
26 సంవత్సరాల మమత సింగర్ గా కెరీర్ ప్రారంభించి 2005లో 'మాయోక్కమ్' అనే మలయాళ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది. తెలుగు, తమిళం, మలయాళం కలిపి మమత ఇప్పటి వరకు 30 చిత్రాల్లో నటించింది. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, చింతకాయల రవి, కింగ్, కేడీ తదితర చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











