మొహమాటానికి పోయి చేసే ఇలా..మమతా మోహన్ దాస్
జీవితంలో ఒకటి రెండు సార్లు మొహమాటానికి పోయి సినిమాలు చేయడం జరిగిందని తను భావిస్తున్నట్లు మమతా మోహన్ దాస్ తెలిపారు. తన సినిమాలు కొన్ని భాక్సా ఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని చూపటానికి కారణంగా ఆమె చెప్పుకొచ్చారు. గాయనిగానే కాక నటిగా కూడా అవకాశాలు తగ్గటాన్ని ఆమె సమీక్షించుకుంది. అయితే గత ఏడాదిలో పది, ఇరవై ఆఫర్ల వరకూ వచ్చాయని...కథలు అంతగా నచ్చకపోవడం వలన చేయలేకపోయానని ఆమె అన్నారు. ప్రస్తుతం నాగార్జున సరసన కామాక్షి కళా మూవీస్ చిత్రంలో ఆమె చేస్తున్నారు. మలయాళంలో ఒక సినిమా సెట్స్‌పై ఉంది. మొన్న స్టార్‌నైట్‌లో దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి 'రాఖీ రాఖీ రాఖీ నా కవాసాకీ...', 'ఆకలేస్తే అన్నం పెడతా...' పాటల్ని ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన 'బిందాస్' ఆడియో వేడుకకు అతిథిగా హాజరయ్యారు మమతా.ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఇక మమతా మోహన్ దాస్ ఇప్పటి వరకూ తెలుగులో యమదొంగ,కృష్ణార్జున,విక్టరీ,హోమం,చింతకాయిల రవి,కింగ్ తదితర చిత్రాలు చేసారు. ఇంతకీ ఆమె మొహమాటికి పోయి చేసి కెరీర్ పోగొట్టుకున్న సినిమాలు ఏమిటో...


Click it and Unblock the Notifications











