'బిగ్ బి' గా మమ్ముట్టి నచ్చుతాడా?
అప్పట్లో 'సామ్రాజ్యం', 'కంకణం', విరోధి వంటి మమ్ముట్టి చిత్రాలు అప్పట్లో తెలుగులోకి డబ్ అయి మంచి విజయం సాధించాయి. అయితే ఈ మధ్య కాలంలో అటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఒకటి రెండు వచ్చినా వర్కవుట్ కాలేదు. మరో ప్రక్క సూర్య వంటి స్టార్ ఏక్ట్ చేసిన ఘటికుడు వంటి చిత్రాలు సైతం భాక్సా ఫీస్ వద్ద బావురుమంటున్నాయి. అయితే తాజాగా మమ్ముట్టి, మమతా మోహన్‌దాస్ జంటగా మలయాళంలో విడుదలయి విజయం సాధించిన 'బిగ్ బి' చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. అదే పేరుతో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
రామగోపాల్ వర్మ శిష్యుడు అమల్ నీరజ్ దీనికి దర్శకుడు. ఈ చిత్రం గురించి నిర్మాత ఎన్.బాలకృష్ణ మాట్లాడుతూ 'ముంబాయి నేపథ్యంగా ఈ చిత్రకథ ఉంటుంది. ఇందులో మమ్ముట్టి మాఫియా డాన్‌గా నటించారు. కేరళ, ముంబాయిలలో షూటింగ్ జరిగింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తొలి కాపీ సిద్ధమైంది. నవంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు. చూద్దాం మరి ఈ చిత్రం ఏ మేరకు విజయం సాదిస్తుందో..


Click it and Unblock the Notifications











