twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలిని తలదన్నేలా మమ్ముట్టి మూవీ... 10 కోట్లతో భారీ సెట్

    |

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి భారతీయ సినిమా పరిశ్రమకే తలమానికంగా మారింది. బాహుబలి అందించిన స్ఫూర్తితో మలయాళ చిత్ర పరిశ్రమ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా చరిత్రలోని వాస్తవ సంఘటనల ఆధారంగా మమాంగం చిత్రం రూపొందతున్నది. జమోరిన్ పాలనలో చావెరుక్కల్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిస్టారికల్ మూవీకి సంబంధించిన వివరాలు ఇవే..

    బాహుబలితో పోల్చుతూ

    బాహుబలితో పోల్చుతూ

    మమాంగం చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. చారిత్రాత్మక నేపథ్యంతో ఫిక్షన్‌గా రూపొందుతుండటంతో దక్షిణాదిలో బాహుబలిని పోల్చి చూస్తున్నారు. ఈ చిత్రానికి ఎం పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మమ్ముట్టి అద్భుతమైన పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.

    దక్షిణాదిలోనే భారీ సెట్ వేశాం: మమ్ముట్టి

    దక్షిణాదిలోనే భారీ సెట్ వేశాం: మమ్ముట్టి

    మమాంగం సినిమాపై మమ్ముట్టి వివరణ ఇస్తూ.. మా సినిమా బాహుబలి మాదిరిగా ఉండదు. బడ్జెట్ పరంగా స్థాయిని అందుకోవడం సాధ్యపడకపోవచ్చు. కానీ సాంకేతికంగా మేము ఆ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకోసం ఓ భారీ సెట్‌ను రూపొందించాం. ఇప్పటి వరకు అంత పెద్ద సెట్‌ను దక్షిణాదిలో ఎవరూ రూపొందించలేదు. వీఎఫ్ఎక్స్‌పై ఆధారపడకుండా సెట్స్‌లోనే సినిమాను పూర్తి చేస్తాం అని మమ్ముట్టి అన్నారు.

    రూ.10 కోట్లతో కోట సెట్

    రూ.10 కోట్లతో కోట సెట్

    మమాంగం సినిమా కోసం సహజసిద్ధంగా కనిపించే కోట సెట్‌ను వేశాం. గ్రీన్ మ్యాట్, పెయింటింగ్‌ వాడకుండా ఒరిజినల్‌గా సెట్‌ను వేశాం. అందుకోసం రూ.10 కోట్లు ఖర్చుపెట్టాం. ఈ సినిమా కోసం తమిళనాడు, కేరళలో ఉండే కలరిప్పయట్టు అనే మార్షల్ ఆర్ట్‌ను నేర్చుకొంటున్నాను. ఈ సినిమాను భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందించేందుకు నిర్మాత వేణు అహర్నిశలు కష్టపడుతున్నారు అని మమ్ముట్టి పేర్కొన్నారు.

    డిసెంబర్‌లో విడుదల

    డిసెంబర్‌లో విడుదల

    తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న మమాంగం చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నది. త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, ప్రాచీ తెహ్లాన్, అను సితార, ప్రాచీ దేశాయ్, మాళవిక మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనోజ్ పిళ్లై సినిమాటోగ్రాఫర్‌గా, రాజా మహ్మద్ ఎడిటర్‌గా, ఎం జయచంద్రన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Mammootty on Mamangam: We cannot touch Baahubali's scale, but we're tryingMammootty's upcoming flick Mamangam is the biggest film under production in Malayalam. There are several reports comparing the film to SS Rajamouli's Baahubali. The makers have spent a whopping sum of Rs 10 crore to erect a set resembling a fort.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X