For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమాయకురాలేం కాదు, దొరికిపోయిన మోహన్ బాబు హీరోయిన్, ఇద్దరు నిర్మాతలు కూడా

  By Srikanya
  |

  హైదరాబాద్ : మోహన్ బాబు తో దొంగ పోలీసు, ప్రేమ శిఖరం వంటి తెలుగు సినిమాల్లో నటించిన మమతా కులకర్ణి గుర్తుంది కదా. ఆమె ఇప్పుడు పెద్ద కేసులో ఇరుక్కుంది. మమతా కులకర్ణిని 2వేల కోట్ల రూపాయల ఎఫిడ్రైన్ రాకెట్ కేసులో నిందితురాలిగా ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు నిర్మాతలు, పైనాన్సియర్ ని కూడా విచారిస్తున్నట్లు తెలిసింది.

  ముంబై పోలీసులు ఈ భారీ డ్రగ్ రాకెట్ ను గత ఏడాది ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్ రాకెట్ తో సబంధం ఉందన్న ఆరోపణలపై మమతా కులకర్ణి భర్త విక్కీ గోస్వామిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

  భారత్ లో ఎఫిడ్రైన్ తయారు చేసి అంతర్జాతీయ డ్రగ్ ముఠాకు అందజేస్తున్నన్న ఈ డ్రగ్ రాకెట్ తో సంబంధం ఉన్న పది మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. రెండు నెలల కిందట పోలీసులు 18.5 టన్నుల ఎఫిడ్రైన్ ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

  ఈ క్రమంలో శనివారం థానేలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ పరంవీర్ సింగ్ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తు పురోగతిని మీడియాకు వెల్లడించారు. అరెస్ట్ సమయంలో మమత కులకర్ణి చెప్పుకున్నట్లు ఆమె అమాయకురాలు కాదని, మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంలో ఆమె పాత్ర కూడా ఉందని అన్నారు.

  దీనిపై ఠానె పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌సింగ్‌ వివరాలు వెల్లడిస్తూ.. ''కెన్యాలో ఉన్న విక్కీని జైన్‌ గతంలో కలిశాడు. షోలాపూర్‌ కర్మాగారంలో మత్తుపదార్థాలను తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించాలని వారు నిర్ణయించారు'' అని తెలిపారు.

  మత్తుపదార్థాలను రవాణా చేస్తూ విక్కీ 2014లో కెన్యాలో అరెస్టయ్యాడని, ఆ తర్వాత బెయిల్‌ మీద విడుదలయ్యాడని చెప్పారు. నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి ఠానె జిల్లాలోని కళ్యాణ్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తూ ఏప్రిల్‌ 10న పట్టుబడిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది.

  ఈ కేసు కూడా..

  ఈ కేసు కూడా..

  ఓ మనీలాండరింగ్‌ కేసులో ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మహారాష్ట్రలోని థానే పోలీసులు ఆమెతోపాటు ఆమె భర్త కెన్యాకు చెందిన విక్కీ గోస్వామిని కూడా విచారిస్తున్నారు.

  అంతకు ముందే

  అంతకు ముందే

  అంతకు ముందే ఆమె డ్రగ్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. 20 టన్నుల ఎఫడ్రిన్‌ డ్రగ్‌ని ముంబయికి తెప్పించడంలో ఆమె పాత్ర ఉందన్న దిశగా ఆ విచారణ జరుగుతోంది. దాని విచారణలో భాగంగా ఈ హవాలా విషయం వెలుగులోకి వచ్చింది.

  మనీ ట్రాన్సఫర్

  మనీ ట్రాన్సఫర్

  ఆమె బాదల్‌పూర్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి పెద్ద అధిక మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. ఆ లావాదేవీల వ్యవహారంపై అప్రమత్తమైన థానే పోలీసులు ఇప్పుడు దీనిపై విచారణ చేపట్టారు. థానే పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బిర్‌ సింగ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

  హవాలా కోణం..

  హవాలా కోణం..

  పెద్ద మొత్తంలో జరిగిన బ్యాంక్‌ ట్రాన్సాక్షన్‌ హవాలా కోణం ఉందా? అన్నదానిపై విచారణ జరుపుతున్నామన్నారు.

  ఇద్దరు నిర్మాతలు

  ఇద్దరు నిర్మాతలు

  ఆమెతో సన్నిహితంగా ఉండే మరో ఇద్దరు బాలీవుడ్‌ నిర్మాతలు, ఓ ఫిలిం ఫైనాన్సర్‌పైనా విచారణ జరుపుతున్నామని చెప్పారు.

  డ్రగ్ డీలర్స్ మీట్

  డ్రగ్ డీలర్స్ మీట్

  జనవరి 8న అంతర్జాతీయ డ్రగ్ మాఫియా అబ్దుల్లాతో కలిసి కెన్యాలో ఆమె సమావేశంలో పాల్గొన్నట్టు దర్యాప్తులో ఆధారాలు లభించాయని, అందుకే నిందితుల జాబితాలో ఆమె పేరుని చేర్చుతున్నట్లు పరంవీర్ ఈ సందర్భంగా చెప్పారు.

  బ్యాంక్ అక్కౌంట్స్ కూడా

  బ్యాంక్ అక్కౌంట్స్ కూడా

  అలాగే మమత, గోస్వామిలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తామని పరంవీర్ సింగ్ తెలిపారు.

  థానేలో....

  థానేలో....

  పట్టుబడ్డ డ్రగ్స్‌ను కెన్యా నుంచి సరఫరా చేశారన్న ఆరోపణలపై మమత కులకర్ణి, ఆమె భర్త విక్కీ గో స్వామిని గత నెల కెన్యా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  మమత గతంలో ..

  మమత గతంలో ..

  కరణ్ అర్జున్, బాజీ, చైనా గేట్, క్రాంతీవీర్, వక్త్ హమారా హై వంటి పలు హిట్ చిత్రాల్లో మమత నటించారు. 1990వ దశకంలో ఆమె బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు.

  ఈ వివరాలు తెలుసుకొని అమెరికాలోని 'డ్రగ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ' అధికారులు ఠానె పోలీసులను సంప్రదించారు. ఇప్పటివరకూ అరెస్టయిన వ్యక్తులందరూ విక్కీ ఆధ్వర్యంలో పని చేస్తున్నారని అమెరికా అధికారులు భావిస్తున్నట్లుగా ఠానె పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రగ్స్‌రాకెట్‌తో మమతాకులకర్ణికి కూడా సంబంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపామని ఆ వర్గాలు వెల్లడించాయి.

  English summary
  Thane Police today named former Bollywood actor Mamta Kulkarni as an accused in India's biggest ever drug racket which was busted two months ago.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X