డ్రగ్స్ బిజినెస్ : హీరోయిన్, ఆమె భర్త దొరికి పోయారు

By Bojja Kumar

హైదరాబాద్: 90వ దశకంలో బాలీవుడ్‌ను తన హాట్ అండ్ సెక్సీ అందాలతో ఊర్రూతలు ఊగించిన ఘనత మమత కులకర్ణి సొంతం. అప్పట్లో దాదాపు 11 ఏళ్ల పాటు ఆమె తన హవా కొనసాగించారు. అయితే ఆ తర్వాత హోటల్ వ్యాపారానికి పరిమితం అయి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు.

తర్వాత తన ప్రియుడు వికీ గోస్వామిని పెళ్లాడిన మమత కులకర్ణి కెన్యాలో నివాసం ఉంటోంది. తాజాగా మమతా కులకర్ణి, ఆమె భర్త వికీ గోస్వామి డ్రగ్స్‌తో కెన్యా పోలీసులకు పట్టుబడ్డారు. వీళ్లు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కెన్యాలోని మోంబాసాలో వీరు పట్టుబడటంతో వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 Mamta Kulkarni, husband detained in Kenya for drug trafficking​

మమత కుల కర్ణి, వికీగోస్వామి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగింది. వీకీ గోస్వామిని 1997లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడగా...ఇస్లాం మతంలోకి మారడంతో శిక్ష తగ్గించి 2012లో విడుదల చేసారు.

వీకీ గోస్వామి జైలుకు వెళ్లిన తర్వాత ఆయన హోటల్ వ్యాపారాన్ని మమత కులకర్ణి చూసుకుంటూ వచ్చారు. ఆయన జైలు నుండి విడుదలైన తర్వాత గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ ప్రస్తుతం కెన్యాలోని నైరుబీలో నివాసముంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X