»   » ఆ హీరోయిన్‌ ని నేను పెళ్ళి చేసుకోలేదు

ఆ హీరోయిన్‌ ని నేను పెళ్ళి చేసుకోలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: డ్రగ్స్‌ స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్కీ గోస్వామి తాజాగా నటి మమతా కులకర్ణి తో తన సంబందం పై సంచలన విషయాలు వెల్లడించాడు. మాజి బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిన మమతా కులకర్ణితో తనకు ఎలాంటి వివాహ సంబంధమూ లేదని, ఆమెను తాను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని విక్కీ చెప్పాడు. తాజా ఆరోపనల నేపథ్యం లో తొలిసారి టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన, తాను డ్రగ్స్‌ స్మగ్లింగ్ చేస్తున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.

'మమతా కేవలం నాకు మంచి స్నేహతురాలు, తను నా శ్రేయోభిలాషి మాత్రమే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడింది. అంతేకానీ ఆమె నా భార్య కాదు. ఆమెను నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు' అని విక్కీ గోస్వామి చెప్పాడు.

 Mamta Kulkarni's husband Vicky says she is not his wife

అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అధినేతగా గుర్తింపు పొందిన విక్కీ గోస్వామి ప్రస్తుతం కెన్యాలోని మొంబాసాలో ఉంటున్నాడు. మామూలుగా భారత్ కు రావటానికి తనకేమీ అభ్యంతరం లేదు కానీ, అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (డీఈఏ) తనను కిడ్నాప్ చేయాలని భావిస్తున్నదని, కాబట్టి తాను భారత్‌కు వచ్చే అవకాశమే లేదని అతను తేల్చిచెప్పాడు.

తనను అంతమొందించటానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ, తనని కావాలనే ఇందులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందనీ చెప్పాడు. ఇటీవల థానెలో పట్టుబడిన రూ. 2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తన గ్యాంగ్‌కే చెందినవని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. కాగా, విక్కీ గోస్వామి భార్యగా భావిస్తున్న మమతా కులకర్ణి గతంలో ఆయనకు మద్దతుగా మీడియాతో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Mamta Kulkarni is only a well-wisher. She stood with me in difficult times but she is not my wife says Vicky Goswamy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu