»   »  డ్రగ్స్ రాకెట్లో హీరోయిన్, నిఘా పెట్టిన పోలీసులు!

డ్రగ్స్ రాకెట్లో హీరోయిన్, నిఘా పెట్టిన పోలీసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 90వ దశకంలో బాలీవుడ్‌ను తన హాట్ అండ్ సెక్సీ అందాలతో ఊర్రూతలు ఊగించిన ఘనత మమత కులకర్ణి సొంతం. అప్పట్లో దాదాపు 11 ఏళ్ల పాటు ఆమె తన హవా కొనసాగించారు. అయితే ఆ తర్వాత హోటల్ వ్యాపారానికి పరిమితం అయి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. అనంతరం తన ప్రియుడు వికీ గోస్వామిని పెళ్లాడారు.

మమత కుల కర్ణి, వికీగోస్వామి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగింది. వీకీ గోస్వామిని 1997లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడగా...ఇస్లాం మతంలోకి మారడంతో పదేళ్లు శిక్ష తగ్గించి 2012లో విడుదల చేసారు.

పెళ్లి తర్వాత తర్వాత ఇద్దరూ కెన్యాలోని నైరోబీకి మకాం మార్చి అక్కడ కూడా డ్రగ్స్ అక్రమ వ్యాపారం మొదలు పెట్టారు. గతంలో వికీ గోస్వామి డ్రగ్స్‌తో కెన్యా పోలీసులకు పట్టుబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

Mamta Kulkarni's role in hubby's drug ring under scanner

ఇపుడు మమత కులకర్ణి పేరు కూడా డ్రగ్స్ రాకెట్లో బయట పడింది. ఆమె నిషేదిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేదిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని సీజ్ చేసారు. ఈ స్మగ్లింగులో మమత భర్త విక్కీ గోస్వామి కీలకపాత్రధారి అని పోలీసులు వెల్లడించారు.

విక్కీ గోస్వామిపై ఇంటర్ పోల్ నోటీసు ఉండటంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కార్యకలాపాలు చూసే బాధ్యత భార్య విక్కికి అప్పగించాడని పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్రలోనూ ఆమె డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు.

వికీ గోస్వామి చాలా కాలంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నా...ఆయన భార్య మమత కులకర్ణి పేరు బయటకు రాలేదు. అయితే ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మమత కులకర్ణి కూడా ఈ డ్రగ్స్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయిందనే విషయం బయటకు వచ్చింది.

English summary
Thane police, which seized 20 tonnes of ephedrine in a record haul this month, is investigating reports that actor Mamta Kulkarni is a central figure in the international drug ring that tried to smuggle in the contraband.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu