శస్త్రచికిత్స చేసాక విశ్రాంతి తీసుకున్నా..మమతా మోహన్ దాస్
'కింగ్' తర్వాత మలయాళంలో 'ప్యాసింజర్' అనే సినిమా చేశా. ఆ తర్వాత గొంతులో చిన్న శస్త్ర చికిత్స చేశారు. దాంతో కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది అంటూ తనకు తెలుగులో గ్యాప్ రావటానికి గల కారణం చెప్పుకొచ్చింది మమతా మోహన్ దాస్. శస్త్ర చికిత్స అనంతరం 'జయీభవ'లో 'గుండెలోన..' అంటూ సాగే పాటను, తమిళంలో యువన్‌శంకర్‌రాజా సంగీతంలో 'గోవా'లో ఓ పాటనూ పాడానంటోంది. ఇప్పుడు నాగ్ సినిమాలో పాడట్లేదు.
ఇక నాగార్జున గురించి చెబుతూ..'కృష్ణార్జున', 'కింగ్' తర్వాత నాగ్‌తో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. ఇందులో నా పేరు జానకి. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర. నేను ఇంతవరకు చాలా మంది నటులతో పని చేశాను. కానీ నాగ్ చాలా నెమ్మదిగా ఉంటారు. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు అంటూ పొగడ్తలల్లో ముంచెత్తుతోంది. అలాగే ఈ కొత్త చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ..మహిళగా ఇలా జీవించాలి అని సాటి మగువలందరూ అనుకునేంత గొప్ప పాత్రలో నటిస్తున్నాను. అది చాలు అని వివరణ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











