బాలీవుడ్ కలల్లో తేలియాడుతున్న మమతా మోహన్
ఆసిన్, జెనీలియా, శ్రియ, త్రిష...వీళ్ల బాటలోనే పయనించాలని మమతా మోహన్ దాస్ తహతహలాడుతోంది. ఇంతకీ హళ్ల బాట ఏమిటనేగా? దక్షిణాది చిత్రాల్లో స్టార్స్ గా గుర్తింపు సాధించి ఆపైన హింధీ చిత్రసీమకు వెళ్లారు. ఈ మధ్యే త్రిష కూడా అక్షయ్ కుమార్ తో నటించేందుకు అంగీకరించింది. తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా, గాయనిగా చేరువైన మమత బాలీవుడ్ కలల్లో తేలియాడుతుంది. హిదీ చిత్రంలో నటించేందుకు రంగం సిద్దం చేసుకొంటోంది. ఓ ప్రముఖ హీరోతో నటించే అవకాశం దక్కించుకొందని ఆమె సన్నిహితులు చెబుతున్నారని చెన్నై సినివర్గాల కథనం. దీని కోసమే మమత ఇటీవల ప్రత్యేకంగా ఫోటో సెషన్ లో పాల్గొందని కూడా అంటున్నారు. ప్రత్యేకమైన డైట్ నియంత్రణ కూడా చేస్తున్నట్లు సమాచారం.
mamta mohandas chintakayala ravi homam yamadonga victory trisha shriya మోహన్ దాస్ బాలీవుడ్ ఆసిన్ జెనీలియా శ్రియ త్రిష హిదీ చిత్రం అక్షయ్ కుమార్


Click it and Unblock the Notifications