రాజమౌళి అలాంటి మాటలు అనడంతో గుండె పగిలింది.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా: యమదొంగ నటి!
సినిమా ఇండస్ట్రీలో మొదట నటిగా మారిన వారు ఆ తర్వాత సింగర్స్ గా కూడా మారారు. ఇక మరికొందరు సింగింగ్ వరల్డ్ నుంచి యాక్టింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇక ఈ రెండు క్యాటగిరీలలో మంచి క్రేజ్ అందుకున్న టాలెంటెడ్ బ్యూటీలలో మమతా మోహన్ దాస్ ఒకరు. ఆమె నటించిన బెస్ట్ తెలుగు సినిమాల్లో యమదొంగ సినిమా ఒకటి. అప్పుడే ఆమె రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అయిపోయింది.
అయితే రాజమౌళి ఒకసారి మాట్లాడిన మాటలకు చాలా బాధపడినట్లు చెప్పిన మమతా మోహన్ దాస్ గుండె పగిలినట్లు అయ్యిందని చెప్పింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా ఆ మాటలను గుర్తు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాతో గాయనిగా..
సింగర్ గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న మతా మోహన్ దాస్ మొదట 2005లో ఒక మలయాళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఇక తర్వాత ఆమెకు గాయనిగా కూడా సౌత్ ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా 2006 తెలుగులో ఆమె రాఖీ రాఖీ అనే సినిమాతో గాయనిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

అలాంటి పాత్రల్లో..
ఇక ఆ తర్వాత మమత అతి తక్కువ కాలంలోనే సినిమా ప్రపంచంలో చాలా బిజీగా మారిపోయింది. ఒకవైపు హీరోయిన్ గా కొనసాగుతూనే మరొకవైపు మంచి పవర్ఫుల్ పాత్రల్లో కూడా నటించింది. ముఖ్యంగా సీరియస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కూడా ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మలయాళం లో ఆమెకు కొన్ని ప్రముఖ అవార్డులు కూడా దక్కాయి.

ఆ ఒక్క సినిమా స్పెషల్
ఇక మమతా మోహన్ దాస్ కెరీర్లో ఎన్ని మంచి సినిమాలు ఉన్నా కూడా అందులో యమదొంగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2007లో వచ్చిన ఆ సినిమాలో అల్లరి అమ్మాయిగా అలాగే యముడి పాత్రకు తగ్గట్టుగా ఆమె కనిపించిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా రేంజ్ పెరగడానికి కూడా మమతా నటన ఎంతగానో ఉపయోగపడింది.

గ్యాప్ లేకుండా చాలా అవకాశాలు
యమదొంగ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మమతా చాలా బిజీ యాక్టర్ గా మారిపోయింది. ఆమెకు గ్యాప్ లేకుండా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎప్పుడూ కూడా తొందరపడకుండా ఆమె మంచి సినిమాలను అయితే వదులుకోలేదు. కానీ కొన్ని పొరపాట్ల కారణంగా మంచి మంచి అవకాశాలను కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది.

రాజమౌళి మాటలు బాధకు గురిచేశాయి
అయితే ఒకసారి ఒక మంచి సినిమా మిస్ చేసుకున్నప్పుడు రాజమౌళి చెప్పిన మాటలు ఆమెను ఎంతగానో బాధకు గురి చేశాయట. గుండె పగిలినంత పని అయింది అని కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఓ సినిమా ఆఫర్ వదిలేసుకున్నప్పుడు ఫోన్ చేసి ఆ సినిమా నువ్వు చేయాల్సింది.. అనవసరంగా వదిలేసుకున్నావు.. వదిలేసి పెద్ద తప్పు చేసావు.. అని ఆయన అనగానే నా గుండె పగిలిపోయింది అని మమతా తెలియజేసింది.

అరుంధతి సినిమా
ఇక మమతా మోహన్ దాస్ వదిలేసుకున్న సినిమా మరేదో కాదు. అనుష్క కెరీర్ బిగ్ హిట్ అరుంధతి. ఆ సినిమా వదిలేసుకున్నందుకే రాజమౌళి ఆమెకు ఫోన్ చేసి ఆ సినిమా నువ్వు చేయాల్సింది అని చెప్పినట్లుగా మమతా మోహన్ దాస్ తెలియజేశారు. ఇక ఆ సినిమా ఎందుకు వదిలేసుకున్నాను అనే విషయాన్ని కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీగా తెలియజేసింది.

అరుంధతి.. ఎందుకు చేయలేదంటే..
అరుంధతి సినిమా ఆఫర్ అనుష్క కంటే ముందు నాకు వచ్చింది. అయితే ఆ సినిమా చేయడానికి కూడా నేను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంతకం కూడా చేశాను. కానీ అప్పుడు ఉన్న నా మేనేజర్ ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదు అని చెప్పడంతో వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నిర్మాత శామ్ ప్రసాద్ రెడ్డి కూడా మాకు ఫోన్ చేసి అడిగినా కూడా నేను చేయలేకపోయాను.. అని మమతా మోహన్ దాస్ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











