మమతా మోహన్ దాస్ విడాకులు ఫైనలైజ్డ్
కొచ్చి : సౌతిండియా హీరోయిన్ మమతా మోహన్ దాస్, ఆమె భర్త ప్రజిత్ పద్మనాభన్ విడాకుల ప్రక్రియ సోమవారం పూర్తయింది. ఈ మేరకు ఇద్దరూ తగిన పత్రాలతో హాజరై ఫ్యామిలీ కోర్టులో సమర్పించారు. ఇక ఇద్దరూ విడిపోయారని నిర్ధారిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమే ఆలస్యం.
తన చిన్ననాటి స్నేహితుడు పద్మనాభన్‌ని 11/11/2011 తేదీని పెళ్లి చేసుకున్న మమతా మోహన్ దాస్ సర్గిగా ఏడాది తిరిగే లోపే విడాకులుక సిద్ధం అయింది. ఈ మేరకు మీడియా ప్రకటన కూడా చేసింది. "మా ఇద్దరి మనస్తత్వాలు వేరని మా ఇద్దరికీ అర్ధమైపోయింది. అలాంటప్పుడు కలిసి కాపురం చేయలేమని నిశ్చయించుకున్నాం. అందుకే, విడాకులు తీసుకోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం." అని మమత మోహన్ దాస్ వెల్లడించారు.
సినీ పరిశ్రమలో ఇలా పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు మమతా మోహన్ దాస్ చేరింది. గతంలో ఆమె తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానిస్తూ... సుమలత చేస్తున్న టీవీ కార్యక్రమం ఓసారి చూశాను. కామన్‌మేన్‌తో జీవితపు బండి అనే ఆ కార్యక్రమంలో కుటుంబాల మధ్య కలతలు, అపోహలు వస్తుంటాయి. నా జీవితం కూడా అలాగే తయారైంది' అని వ్యాఖ్యానించారు.
26 సంవత్సరాల మమత సింగర్ గా కెరీర్ ప్రారంభించి 2005లో 'మాయోక్కమ్' అనే మలయాళ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది. తెలుగు, తమిళం, మలయాళం కలిపి మమత ఇప్పటి వరకు 30 చిత్రాల్లో నటించింది. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, చింతకాయల రవి, కింగ్, కేడీ తదితర చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications












