twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మమతా మోహన్ దాస్ నిశ్చితార్ధం రేపే

    By Srikanya
    |

    మళయాళ ముద్దు గుమ్మ మమతా మోహన్ దాస్ రేపు అనగా (11-11-11)నిశ్చితార్దం చేసుకుంటోంది.ఆమె చేసుకోబోయే వ్యక్తి చిననాటి స్నేహితుడు,మరియు ఓ బిజెనెస్ మ్యాన్.వచ్చే సంవత్సరం వివాహం జరునుంది.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...గత కొన్నేళ్లుగా నేను ఓ బిజినెస్‌మాన్‌ని డేటింగ్ చేస్తున్నా.మా స్నేహం ప్రేమగా మారింది.అసలు మేము స్నేహితులమనే అనుకున్నాం.అయితే ఏళ్లు గడిచే కొద్దీ మా మధ్య స్నేహంకన్నా ఎక్కువ ఇంకేదో ఉందని, అదే ప్రేమ అని తెలుసుకున్నాం.మా ప్రేమను మా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.వాస్తవానికి తను బహ్రెయిన్‌లో ఉంటాడు. షూటింగ్స్ నుంచి ఖాళీ దొరికితే చాలు మా నాన్నతో స్పెండ్ చేయడానికి నేను బహ్రెయిన్ వెళుతుంటాను.మా నాన్న అక్కడ ఒక అమెరికా బేస్డ్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు.మా అమ్మ ఎక్కువగా నాతో షూటింగ్స్‌కు హాజరయ్యేవారు.ఖాళీ దొరికినప్పుడు నేను, మా అమ్మ బహ్రెయిన్ వెళ్లేవాళ్లం.ఆ సమయంలో ఆ అబ్బాయిని కలుసుకునేదాన్ని.మా మధ్య బాగా అవగాహన కుదిరింది. తనే నా మిస్టర్ రైట్ అనిపించింది అన్నారు.ఇక ఆమె తెలుగులో యమదొంగ,విక్టరీ,కేడీ వంటి సినిమాలు చేసి పేడవుట్ అయిపోయింది.ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ తడయార తాక్క అనే తమిళ చిత్రంలోను,మళయాళంలో మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నారు.ఒప్పుకున్న సినిమాలు ఏప్రిల్ వరకు షూటింగ్స్ జరుగుతాయి.ఆ తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి పరిమితం కానుంది.

    English summary
    South Indian actress and singer Mamta Mohandas is getting engaged to her Bahrain based boyfriend in Kochi on November 11, 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X