చిన్ననాటి స్నేహితుడితోనే నా పెళ్ళి: మమతా..!
సౌత్ సినిమాల్లో ఒకప్పుడు మంచి పాపులర్ అయిన టాలెంటెడ్ సింగర్ మమతా మోహన్ దాస్ పెళ్ళి చేసు కోబోతున్నాని అందుకు తగ్గ వరుడు దొరకాలని చెప్పిన మమత ప్రస్తుతం తన చిన్న నాటి స్నేహితుడినే పెళ్ళాడబోతోంది. ఎంత పెద్ద స్టార్ అయినా ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలని డిసైడ్ అయిందని, తనకు ఇప్పుడు పెళ్ళి వయస్సు వచ్చిందని. పెళ్ళి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకొంటోందట.
మమతా మోహన్ దాస్ ప్రస్తుతం తమిళ్, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడిన మమతా 'నేను వచ్చే యేడాది పెళ్ళి చేసుకోవుతున్నాను. నా చిన్నప్పటి ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేమిద్దరం బహరైన్ లో కలుసుకునే వాళ్ళం. మా ఇద్దరి అభిప్రాయాలు బాగా కలుస్తాయి. దాంతో మేమిద్దం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మా పెద్దలు కూడా మా పెళ్ళికి అంగీకరించారు అని చెప్పింది. ఈ మద్యనే క్యాన్సర్ నుండి బయటపడిన మమత ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటోంది.


Click it and Unblock the Notifications











