'రణభీర్' తో మమత
తెలుగులో ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన కేరళ కుట్టి మమత మోహన్ దాస్. ఆ తర్వాత అవకాశాలు వస్తున్నా అంతగా ప్రాధాన్యం లేని సెకెండ్ హీరోయిన్ పాత్రలే రావడంతో టాలీవుడ్ కు దూరమయింది. మాతృభాష మలయాళంలో సినిమాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో రెంటికీ చెడ్డరేవడిలా తయారయింది మమత పరిస్థితి.
కానీ మమత అదృష్టం బాగుండి బాలీవుడ్ లో చేసిన ప్రయత్నాలు ఫలించి అక్కడి దర్శకుల దృష్టిని ఆకర్షించింది. 'జబ్ వుయ్ మెట్', 'లవ్ ఆజ్ కల్' లాంటి హిట్ మూవీస్ అందించిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. కాగా తాజాగా 'సావరియా' చిత్ర కథానాయకుడు రణభీర్ కపూర్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం కూడా మమతను వరించింది. దక్షిణాదిన ఐరన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న మమత బాలీవుడ్ లో ఏ మాత్రం తన ప్రభావాన్ని చూపనుందో చూద్దాం.
More from Filmibeat
mamatha mohandas king nagarjuna trisha ranbir kapoor imtiaz ali jab we met love aaj kal మమత మోహన్ దాస్ ఎన్టీఆర్ నాగార్జున వెంకటేష్ రణభీర్ కపూర్ ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్


Click it and Unblock the Notifications











