»   »  నాచావుకు చిరంజీవి కారణం, నా బిడ్దలను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలి

నాచావుకు చిరంజీవి కారణం, నా బిడ్దలను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేవన్న అనే 38 ఏళ్ల వ్యక్తి శనివారం తన భార్యా పిల్లలతో కలిసి సెక్రటేరియట్ కు వచ్చిన తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని సెక్రటేరియట్ సిబ్బంది గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యాయత్నానికి కారణమేంటో వివరిస్తూ దేవన్న లేఖ కూడా రాశాడు.

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి

తన పరిస్థితికి రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.. నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివలింగయ్యలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కారణమని దేవన్న ఆరోపించాడు.భార్య, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి దేవన్న సచివాలయానికి వచ్చాడు.

మెగా ఫ్యామిలి గురించి

మెగా ఫ్యామిలి గురించి

దేవన్న దగ్గర ఓ లేఖ లభించింది. ఈ లేఖలో మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జేసీ శివలింగయ్యలు మూడేళ్ల నుంచి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని లేఖ పేర్కొన్నారు. తాగునీరు, తిండి, ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌ ముందు సమాధి చేయాలని దేవన్న కోరారు. దేవన్న లేఖలో మెగా ఫ్యామిలి గురించి ప్రస్తావించాడు.

ప్రజారాజ్యం పార్టీకోసం

ప్రజారాజ్యం పార్టీకోసం

ప్రజారాజ్యం పార్టీకోసం జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దేవన్నకు భార్యతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇల్లు గడవలేని పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి దేవన్న సెక్రటేరియట్ కు వచ్చాడు.

మరణానంతరం

మరణానంతరం

చిరంజీవిని కలిసి సాయం అడిగేందుకు ఆయన ఇంటి వద్ద పలుమార్లు ప్రయత్నించినా.. సెక్యూరిటీ సిబ్బంది తనను లోనికి పంపలేదని దేవన్న వివరించాడు. తన మరణానంతరం తన బిడ్డల బాగోగులు చూడాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దేవన్న విన్నవించడం విశేషం.

పవన్‌కల్యాణ్‌ ఆదుకోవాలి

పవన్‌కల్యాణ్‌ ఆదుకోవాలి

‘చదువు వదిలేశా.. తండ్రి, కొడుకుని పోగొట్టుకున్నా. చిరంజీవి సోదరులను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించా. సిబ్బంది అనుమతించలేదు. నా బిడ్డలను పవన్‌కల్యాణ్‌ ఆదుకోవాలి' అని దేవన్న లేఖలో పేర్కొన్నాడు. అయితే ఈ సంగతి అటు చిరంజీవికి గానీ, ఇటు పవన్ కి గానీ చేరిందో లేదో మాత్రం ఇంకా తెలియలేదు.

English summary
A man named Devanna of Nirmal attempted suicide in front of Telangana Secretariat and his Suicide Note turns sensational
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu