అల్లు అర్జున్ కి ఆరు నెలలే.. సునీల్ కి రెండేళ్లు
సునీల్ సిక్స్ ప్యాక్ ఇవాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అంతా పూల రంగడులో అతని సిక్స్ ప్యాక్ ని చూసి ఎవరు ట్రైనర్ అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఫిటినెస్ ట్రైనర్ అంటే అబ్దుల్ ఖలీల్ అని తెలిసింది. అతను కూడా నటుడు అవుదామనుకున్న వ్యక్తే. గతంలో అతను అల్లు అర్జున్,సాయిరామ్ శంకర్,నాగచైతన్య వంటి వారికి ఫిజికల్ ట్రైనర్ గా ఉన్నాడు. ఖలీల్,సునీల్ గతంలో మంచి స్నేహితులు. వాసు సమయంలో ఇద్దరూ కలిసి నటించారు. వాసుతో సునీల్ కమిడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఖలీల్ స్ట్రగులింగ్ యాక్టర్ గా మిగిలిపోయాడు.
ఇక సునీల్ కి ట్రైనింగ్ ఇవ్వటం గురించి ఖలీల్ మాట్లాడుతూ...అలా సిక్స్ ప్యాక్ బాడీ సాధించటం చెప్పినంత ఈజీ మాత్రం కాదు. నేను ఆ విషయం లో సునీల్ ని బాగా ఎప్రిషియేట్ చేస్తున్నాను. నేను పెట్టిన రూల్స్,కండిషన్స్ ఏదీ వదలకుండా పాటించాడు. దాదాపు రెండేళ్లు పట్టింది ఆ షేప్ కు రావటానికి. అదే అల్లు అర్జున్ కి అయితే కేవలం ఆరు నుంచి ఏడు నెలలకే ఆ బాడీ వచ్చేసింది అన్నారు. తాను దేశముదురు సమయంలో అల్లు అర్జున్ కి సిక్స్ ప్యాక్ రావటానికి ట్రైనింగ్ ఇచ్చానని చెప్పారు. తను చిన్నప్పటినుంచి తన శరీరంపై దృష్టి పెట్టేవాడినని చెప్పారు. నటుడుగా తను నిలదొక్కుకోలేకపోయినా ఫిజికల్ ట్రైనర్ గా మంచి ఆపర్స్ వస్తున్నాయని అన్నారు.


Click it and Unblock the Notifications











