Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అన్నపూర్ణ స్టూడియో వ్యక్తి మృతి.. రహస్యంగా, అనేక అనుమానాలు!
Recommended Video
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో సిబ్బందిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందిన వార్త సంచలనంగా మారింది. నారాయణరెడ్డి (53) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో అన్నపూర్ణ స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అతడి మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారట.
మృతుడి కుటుంబ సభ్యులకు సైతం తెలియకుండా ఆసుపత్రికి తరలించడం పట్ల పలు అనుమానాలు మొదలయ్యాయి. నారాయణరెడ్డి ఎలా మరణించాడు, ఎప్పుడు మరణించాడు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
జూబ్లీహిల్స్ పోలీసులు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకొని విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హత్య జరిగి ఉంటుందనే అనుమానాల్ని కూడా మృతుడి బంధువులు వ్యక్తపరుస్తున్నారు. గత ఏడాది కూడా అన్నపూర్ణ స్టూడియోలో అనుకోకుండా భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.