దారుణం: థియేటర్లో సీటు మధ్య తల ఇరుక్కోవడంతో వ్యక్తి మృతి

By Bojja Kumar

యూకెలో ఓ సినీ ప్రేక్షకుడు ఎవరూ ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. ఇంగ్లండ్ లోని బర్మింగ్‌ హామ్‌‌లో స్టార్‌ సిటీ ఎంటర్టెన్మెంట్ కాంప్లెక్స్‌‌లోని థియేటర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీటు మధ్యలో తల ఇక్కోవడం కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

బర్మింగ్ హామ్‌లోని మాల్ నిర్వాహకులు చెప్పిన వివరాల ప్రకారం.... ఒక వ్యక్తీ తన భార్యతో కలిసి సినిమా చూసేందుకు 'గోల్డ్‌ క్లాస్‌'‌ లగ్జరీ టికెట్ తీసుకున్నారు. సినిమా చూస్తుండగా సెల్ ఫోన్ రెండు సీట్ల మధ్య సందులో పడిపోయింది. దాన్ని తీసుకోవడానికి అతడు కిందకు వంగి రెండు సీట్ల మధ్య తల దూర్చాడ. అదే సమయంలో ఎలక్ట్రానిక్‌ ఫుట్‌ రెస్ట్‌ అతని తలపై పడి తల అందులో ఇరుక్కుపోయింది.

Man Dies After Getting Head Stuck in Movie Theater Seat

వెంటనే అతడి భార్య థియేటర్ సిబ్బందికి విషయం చెప్పగా వారు అతడిని బయటకు తీయడానికి చాలాసేపు కష్టపడ్డారు. చివరకు కుర్చీ కాలు విరగ్గొట్టి బయటకు తీశారు. ఈక్రమంలో గాయాలపాలై ఆందోళనకు గురైన ఆ వ్యక్తి గుండె ఆగిపోయింది. వెంటనే పారామెడిక్స్ రంగంలోకి దిగి అతడి ప్రాథమిక చికిత్స చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేసి ఉపశమనం కలిగించారు.

వెంటనే అతడికి హార్ట్‌లాండ్ ఆసుపత్రికి తరలించారు. మార్చి 9వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకోగా...ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి మార్చి 16వ తేదీన మరణించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X