ఒకరు మృతి, హీరోయిన్‌ సయాలీ భగత్‌కి గాయాలు

By Bojja Kumar

గ్రేటర్ నోయిడాలో ఓ స్పోర్ట్స్ మాల్ ప్రారంభోత్సవంలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. ఎఎమ్ఆర్ అడ్వెంచర్ మాల్ పారంభోత్సవం సందర్భంగా బైక్ స్టంట్స్ చేస్తూ శైలేంద్రసింగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ సయాలీ భగత్‌ ఈ ఘటనలో గాయ పడ్డట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

'బ్లేడ్ బాబ్జీ' చిత్రం ద్వారా అల్లరి నరేష్ సరసన సయాలీ భగత్ తెలుగులో పరిచయం అయింది. 'ఇంకోసారి' అనే మరో తెలుగు చిత్రంలోనూ నటించింది. ఈ రెండు చిత్రాల్లో అమ్మడు ఫుల్లుగా ఎక్స్ ఫోజింగ్ చేసి, బికినీల్లో దర్శనం ఇచ్చినా ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం 'ఘోస్ట్' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షైనా ఆహుజా, షాజిద్ ఖాన్, ఆర్య బబ్బర్ తను లైంగికంగా వేధించారని సయాలీ అప్పట్లో ఆరోపించింది. టిను వర్మ రూపొందించిన 'ది వీకెండ్" ఫస్ట్ లుక్ ఆవిష్కరణలో తాను పాల్గొన్నప్పుడు అదే వేడుకకు వచ్చిన అమితాబ్‌కు తాను పాదాభివందం చేశానిని, మనవరాలి వయసున్న తనను అమితాబ్ అలా కాకుండా మరో రకంగా చూసి తాక కూడని చోట తాకాడని, ఆ సమయంలో అమితాబ్ చెంప చెల్లుమనిపించాలని అనిపించిందని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

నటుడు షైనీ ఆహుజా తనను లైంగికంగా వేధించాడని, హీరో ఆర్య బబ్బర్ తనకు అసభ్యమైన మెసేజ్‌లు, వెగటు పుట్టించే ఫోటోలు పంపే వాడని, దర్శకుడు సాజిద్ ఖాన్ అతని ముందు తనను నగ్నంగా నిలబడమన్నాడని...ఆ మధ్య సంచలన ఆరోపణలు చేసింది ఈ భామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X