»   » బాలీవుడ్ హీరో సిస్టర్‌ని మోసం చేసిన గ్యాంగ్‌స్టర్

బాలీవుడ్ హీరో సిస్టర్‌ని మోసం చేసిన గ్యాంగ్‌స్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ సిస్టర్ ఫయిస్టా ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్ చేతిలో మోస పోయింది. ఫలితంగా దాదాపు 50 లక్షల ఖరీదు చేసే మెర్సిడెజ్ బెంజికారును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ముంబైకి చెందిన పాత నేరస్తుడు, గ్యాంగస్టర్ అఫ్తాబ్ పటేల్ ఈ మోసానికి పాల్పడ్డాడు.

ఫయిస్టా తమ మెర్సిడెజ్ కారును ఆన్ లైన్ ద్వారా ఈ నెల 7న అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ప్రకటన చూసిన అఫ్తాబ్ పటేల్... సాహిల్ ఖాన్ సోదరి ఫయిస్టాకు ఈ నెల 8న ఫోన్ చేసింది. అదే రోజు కాందివ్లీ అనే విలేజ్ వద్ద సాయింత్రం కలిసి ఈ విషయమై మాట్లాడుకున్నారు. రూ. 42 లక్షలకు డీల్ కుదిరింది.

Man Flees With Actor's Mercedes

కారు కొనే ముందు తాను టెస్ట్ డ్రైవ్ చేస్తానని ఆఫ్తాబ్ పటేల్ కోరాడు. తర్వాత ఒక రోజు ఉదయం 8 గంటలకు తన స్నేహితులతో కలిసి వచ్చిన ఆప్తాబ్ పటేల్.... డ్రైవర్ అర్షాద్ అన్సారీకి అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చాడు. అనంతరం టెస్టు డ్రైవింగుకు వెళ్లి వచ్చాడు. మిగతా డబ్బు చెల్లించి కారు తీసుకెళతానని చెప్పాడు.

డబ్బు తన ఖాతాలో జమ చేయాలని అఫ్తాబ్ పటేల్ కు సూచించింది ఫయిస్టా. అయితే మరో సారి టెస్ట్ డ్రైవింగ్ చేస్తానని మరో రోజు ఆమె ఇంటికి వెళ్లి కారు తీసుకెల్లిన అఫ్తాబ్ పటేల్ మళ్లీ తిరిగి రాలేదు. ఈ విషయాన్ని ఫయిస్టా తన సోదరుడు సాహిల్ ఖాన్ కు చెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసారు.

English summary
Giving out your car for a test drive can be a risky proposition, as Bollywood actor Sahil Khan found out a week ago. Gangster Aftab Patel, who has been externed from Mumbai and Thane for previous crimes, allegedly fled with a Mercedes belonging to Sahil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu