»   » పవన్ కళ్యాణ్ మరో పెళ్లిపై.... రేణు దేశాయ్ సెటైర్!

పవన్ కళ్యాణ్ మరో పెళ్లిపై.... రేణు దేశాయ్ సెటైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తనతో పాటు బద్రి చిత్రంలో నటించిన రేణు దేశాయ్‌తో పవన్ కళ్యాణ్ ప్రేమలో పడటం, ఆమెతో కొంతకాలం సహజీవనం చేయడం, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం తెలిసిందే. కారణాలు తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. పవన్ కళ్యాణ్ విదేశీ భామను మూడో పెళ్లి చేసుకోగా.... రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణెలో ఉంటున్నారు.

Man has kids remarry no problem: Renu Desai

కాగా... తాజాగా రేణు దేశాయ్ తన ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ‘పిల్లలు ఉన్నప్పటికీ మగాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవడం వల్ల సమస్య ఏమీ ఉండదు. కానీ మహిళ పరిస్థితి అలా కాదు. పిల్లలు ఉన్నపుడు ఆమె మరో పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. బేసిగ్గా....తల్లిగా ఉండాలంటే, ఆమె హ్యూమన్ గా ఎమోషన్స్‌ కలిగి ఉండటం మానేయాలి' అంటూ ట్వీట్ చేసారు.

‘నేను ఇకపై ఎప్పటికీ మళ్లీ ప్రేమలో పడను...ఈ విషయం నన్ను ఎప్పుడు అడిగినా ప్రేమలో పడను, పడను అనే చెబుతాను' అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు. రేణు దేశాయ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలన్నీపవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాయనే అభిప్రాయం పలువురి నుండి వ్యక్తం అవుతున్నాయి.


రేణు దేశాయ్ వ్యాఖ్యల్లో.... పవన్ కళ్యాన్ ఆమె జీవితంలో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మనో వేదనతోనే ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తుందని అంటున్నారు. పాపం రేణు దేశాయ్!!
English summary
"Man has kids remarry no problem Woman has kids remarry big prob &taboo! Basically being a mother,a woman stops being a human with emotions" Renu Desai.
Please Wait while comments are loading...