యాక్సిడెంట్: నిర్మాత బెల్లంకొండ ఇంటిపై దాడి

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద దాడి జరిగింది. బెల్లంకొండ సురేష్ కు చెందిన కారు ఫిల్మ్ నగర్ రోడ్ నెం.7లో ఓ యువకుడితో పాటు మరికొందరిని ఢీ కొట్ఢీటింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా వెళ్లిపోయాడు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడి బంధువులు, స్థానికులు బెల్లంకొండ ఇంటిమీద దాడి చేసారు.

పూల కుండీలు, ఇంటి అద్దాలు, కారు అద్దాలు ధ్వంసం చేసారు. ఈ క్రమంలో వారిని బెల్లంకొండ సురేష్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అతనిపైనా దాడి చేసినట్లు సమాచారం. ఈ విషయమై బెల్లంకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. యాక్సిడెంటుకు కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్ననట్లు సమాచారం.

 Man injured by Bellamkonda Suresh car

యాక్సిడెంట్ ఘటన, దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బెల్లంకొండ సురేష్ డ్రైవర్ మీద, ఆఫీసు మీద దాడి చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. బెల్లంకొండపై దాడి సంఘటన ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X