»   » ఆ నటిని వేధించిన వ్యక్తిని హత్య చేసారు

ఆ నటిని వేధించిన వ్యక్తిని హత్య చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Man killed in Tamilnadu
చెన్నై: సినిమా నటిని ప్రేమించాడు. కారణం ఏమిటో తెలియదు కానీ ఆమె వేరొకిని పెళ్లి చేసుకుంది. దీంతో కక్ష పెంచుకుని సదరు వ్యక్తి ఆమె వెంట పడి వేధింపులకు గురి చేసాడు. ఈ పరిణామాలు చివరకు అతని హత్యకు దారి తీసాయి. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై మాంగాడుకు చెందిన జహీర్ ఖాన్(28) పందెంకోళ్లను పెంచుతూ జీవిస్తుంటాడు. గతంలో జహీర్ ఖాన్ తండయార్ పేటలోని రాజశేఖరన్ నగర్లో నివాసం ఉన్న సమయంలో సినిమా సహాయ నటి సోనాతో ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే సోనా వేరొకరిని పెళ్లాడిందనే కోపంతో వెంట పడి వేధించడం ప్రారంభించాడు.

ఈ విషయాన్ని సోనా తన చెల్లెలు మోనికకు చెప్పుకుంది. మోనిక జహీర్ ఖాన్‌ను కలిసి హెచ్చరించినా అతని తీరు మార్చుకోక పోవడంతో.....తన ప్రియుడు జయరామన్‌ను ఈ విషయం చెప్పింది. జహీర్ ఖాన్ తీరుపై ఆగ్రహంతో ఊగిపోయిన జయరామన్ అతన్ని పథకం ప్రకారం హత్య చేసాడు.

జయరామన్ తన స్నేహితులైన జయకుమార్, సురేష్ కుమార్, సెల్వకుమార్‌లతో కలిసి జహీర్ ఖాన్‌కు మధ్యం సేవించి మత్తులో ఉండగా అతన్ని హత్య చేసారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్య వెనక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే విషయమై కూపీ లాగుతున్నారు.

English summary
Man killed in Tamilnadu, who harasses supporting actress sona. Four persons have involved in this incident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu