‘బిగ్ బాస్’ నటికి లైవ్‌లోనే లిప్ లాక్.. కలకలం రేపుతున్న వీడియో
'బిగ్ బాస్' రియాలిటీ షో ఎంతో మందిని సెలెబ్రిటీలుగా మార్చేసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఇదే కనిపించింది. ఇదే జాబితాలోకి చేరుతారు తమిళ 'బిగ్ బాస్' సీజన్ -2 కంటెస్టెంట్లు ఐశ్వర్య దత్తా, యషిక ఆనంద్. వీరిద్దరూ కొన్ని సినిమాల్లో నటించినా రాని పాపులారిటీ ఈ షో తర్వాత వచ్చింది. ఆ తర్వాతే వీళ్లిద్దరూ భారీ సినిమాల్లో సైతం ఆఫర్లు సొంతం చేసుకున్నారు.

‘బిగ్ బాస్' నుంచి స్నేహితులుగా..
ఐశ్వర్య దత్తా, యషిక ఆనంద్ తమిళ ‘బిగ్ బాస్' సీజన్ -2 కంటెస్టెంట్లు వెళ్లినప్పటి నుంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ షోకు ముందు పెద్దగా పరిచయం లేని వీరిరువురూ.. ఆ తర్వాత మాత్రం ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. దీంతో అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ పార్టీ చేసుకున్నా కలిసే ఉంటున్నారు. ఏడాదిగా వీళ్లిద్దరూ ఎన్నోసార్లు మీడియా కంట పడ్డారు.

ఏడాది అయిన సందర్భంగా..
‘బిగ్ బాస్' సీజన్ ముగిసి ఏడాది అయిన సందర్భంగా ఈ భామలిద్దరూ ఫేస్‌బుక్ లైవులోకి వచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు ‘బిగ్ బాస్' హౌస్‌లో జరిగిన సంఘటనలను నెమరు వేసుకున్నారు. వివాదాలు, గొడవలు, తదితర విషయాలను గురించి ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అదే సమయంలో తమ స్నేహం గురించి కూడా ఇద్దరూ గొప్పగా చెప్పుకున్నారు.

ఊహించని రీతి లిప్ లాక్
వీడియో లైవ్ చివర్లో ‘లవ్ యూ ఆల్' అంటూ ముగించబోతుండగా.. ఓ యువకుడు యషిక పెదాలపై ముద్దు పెట్టాడు. అది కూడా లైవ్ నడుస్తుండగానే.. దీంతో ఇది కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. గత జూన్ 21న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తోంది. దీనిపై చాలా మంది పలు రకాల స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
‘బిగ్ బాస్' హౌస్‌లోనూ ఇలాగే..
‘బిగ్ బాస్' హౌసులో ఉన్న సమయంలో ఐశ్వర్య దత్తా కూడా సహచర కంటెస్టెంట్‌కు లిప్ కిస్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. తమిళ బిగ్ బాస్ 2లో జననీ అయ్యార్, ఐశ్వర్య దత్త లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకుని సంచలనానికి తెరలేపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమిళనాడులో ఈ రియాలిటీ షోపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

యషిక మొదటి నుంచీ బోల్డుగానే
గౌతమ్‌కార్తిక్ హీరోగా నటించిన అడల్ట్ సినిమా ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు'తో తమిళ సినిమాకి పరిచయమైన తార యషిక ఆనంద్. తెరపై బోల్డుగా కనిపించడమే కాదు, అంతకుమించి బోల్డుగా మాట్లాడుతూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది. దాంతో బిగ్‌బాస్ రెండో సీజన్‌లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లోనూ బోల్డుగానే కనిపించింది.


Click it and Unblock the Notifications











