»   » ఫిల్మ్ సిటీలో కాల్పులు: పక్కనే అమితాబ్ బచ్చన్

ఫిల్మ్ సిటీలో కాల్పులు: పక్కనే అమితాబ్ బచ్చన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ముంబై ఫిల్మ్ సిటీలో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఏజెన్సీ యజమానిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగు జరుగుతున్న 20 అడుగుల దూరంలోనే కావడం గమనార్హం. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Man Shot at Mumbai's Film City

ఈ విషయమై అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ముంబై ఫిల్మ్ సిటీలో కాల్పులు జరిగాయి. చూస్తే గ్యాంగ్ వార్ షూటౌట్ లా ఉంది. మా షూటింగుకు 20 అడుగుల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఒకరు చనిపోయారు. ఎక్కడ చూసిన పోలీసులే అంటూ అమితాబ్ వెల్లడించారు.


ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ....ఆయుధాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఒక వ్యక్తికి కడుపులో గాయం అయినట్లు తెలిపారు.
English summary
A man who reportedly owns a security agency in Mumbai has been shot this afternoon at Film City.
Please Wait while comments are loading...