సైరా చూశాక నాగ్, వెంకీ, రజిని రియాక్షన్ ఇది.. నిజం బయట పెట్టిన చిరు..
సైరా సినిమా తెలుగు నాట దిగ్విజయంగా దూసుకుపోతున్న వేళ మెగాస్టార్ చిరంజీవిని, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ను మాటల మాంత్రిడకు త్రివిక్రమ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యలూ చిరు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. త్రివిక్రమ్ కూడా తన మాటలతో సైరాను, చిరును ఆకాశానికెత్తేశాడు.

చిరు యుద్దం గెలిచాడు..
మాటల మాంత్రికుడు.. తన మాటలతో అందర్నీ ఆశ్చర్య పరుస్తాడాని అందరికీ తెలిసిందే. అయితే చిరును ఇంటర్వ్యూ చేసే సమయంలోనూ తన మాటలతో కట్టిపడేశాడు. ఎవ్వరూ తమ బలాలు వదిలేసి యుద్ధం చేయరు..గాంఢీవం లేకుండా అర్జునుడు, గద లేకుండా భీముడు యుద్ధం చేయలేరు.. కానీ.. పాటలు డ్యాన్సులు లేకుండా సినిమా తీసి యుద్ధంలో గెలిచారు అంటూ తన శైలిలో సైరాను చిరును ఒకేసారి పొగిడేశాడు. కథ రాసేవరకు రాజులం తరువాత దానికి మనం బానిసలమంటూ మరో నీతి చెప్పేశాడు. దీంతో చిరు కూడా అది నిజమే.. మంచిగా చెప్పావ్.. అని చిరు కితాబిచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా చిరు చెప్పిన విశేషాలు..

నాగ్ రియాక్షన్..
చిరుతో మాట్లాడుతూ.. క్లైమాక్స్ లో మీకు ఓ డౌట్ ఉందని నాతో చెప్పారు గుర్తుందా అని త్రివిక్రమ్ అడిగాడు. తల తెగాక ఒక షాట్ ఉందని చెప్పారు. అది అద్భుతంగా.. అందరూ నమ్మేట్టుగా తీశారు. ఆ షాట్ చాలా బాగా వచ్చిందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. వెంటనే చిరు అందుకుంటూ.. ‘సైరా సినిమాను నాతో పాటు నాగార్జున చూశాడు. బయటకు వచ్చాక ఏమి మాట్లాడట్లేదు.. కళ్ళేమో ఎర్రగా అయి ఉన్నాయి.. సినిమా అదిరిపోయిందని.. ఇలాంటి కథను కమర్షియల్ హంగులు తొడిగి తీయడం మామూలు విషయం కాదు.. సినిమా ఎక్కడికో వెళ్తుందని చెప్పాడ'ని చిరు గుర్తు చేసుకున్నాడు.

హగ్ చేసుకున్న వెంకీ
‘సినిమా చూశాక వెంకటేష్ ఫోన్ చేసి..మీరు ఎక్కడున్నారు.. రేపు ఇంట్లోనే ఉంటారా అని అడిగాడు. ఉదయాన్నే వెంటనే ఇంట్లోకి వస్తూనే గట్టిగా కౌగిలించుకుని.. ఓ ముద్దు పెట్టేశాడు.. ఆ తరువాత కొద్ది సేపటికి మాట్లాడుతూ.. నిన్నటి నుంచి ఆపుకున్నాను.. ఫోన్ చేసి చెప్పచ్చు గాని.. నా రియాక్షన్ చూపలేను' అని అన్నాడoటూ చిరు చెప్పుకొచ్చాడు.

రజినీ రియాక్షన్..
ఇక సినిమా చూశాక.. రజిని ఫోన్ చేసి మాట్లాడాడు.. అతను మాట్లాడటమే కాకుండా ఆయన భార్య కూడా మాట్లాడింది. చాలా బాగుంది.. నిన్నంతా అదే మూడ్ లో ఉన్నామని అన్నట్లు చిరు బయట పెట్టాడు. నా అభిమానులు నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయ్... అయితే నా తోటి నటుల నుంచి ఇలాంటి ప్రశంసలు విన్నప్పుడు ఇంకేం కావాలనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











