Pushpa చూసి ఇన్స్పైర్ అయి స్మగ్లింగ్.. ఒక బోర్డర్ దాటి అలా దొరికేశాడు.. చివరికి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప' ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ బాషల కంటే ఎక్కువగా నార్త్ లో ప్రభంజనం సృష్టించింది. క్రికెటర్లు అందరూ అయితే ఆయన మాయలో పడిపోయారు. పుష్ప సినిమా పాటలు, డైలాగ్స్ కు రీల్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి పుష్ప సినిమా ఇన్స్పిరేషన్ తో స్మగ్లింగ్ చేయబోయి అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఆ వివరాలు

100 కోట్ల క్లబ్ లోకి

100 కోట్ల క్లబ్ లోకి

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ గా వచ్చిన 'పుష్ప' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ను సైతం ఈ సినిమా షేక్ చేసి కరోనా సమయంలో కూడా హిందీలో రూ. 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరింది. దక్షిణాది సినిమా పవర్ ఏంటో బాలీవుడ్ కు చూపించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించారు.

తగ్గేదే లే'

తగ్గేదే లే'

అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదే లే' డైలాగ్ చాలా పాపులర్ అయింది. అలాగే అల్లు అర్జున్ భుజం వంచి నడిచే ధోరణి, గడ్డాన్ని చేతితో సవర దీసుకున్న విధానం అన్నీ పాపులర్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'పుష్ప' సినిమాలో హీరోను స్మగ్లర్ గా చూపించారని.. చివరి ఐదు నిమిషాల్లో హీరోను మంచిగా చూపిస్తామనో లేదా రెండో పార్టులో మంచిగా చూపిస్తామనో అంటారని... రెండో పార్ట్ వచ్చేలోపు సమాజం చెడిపోదా? అని ప్రశ్నించారు.

 ప్లానింగ్ చూసి ముచ్చటపడి

ప్లానింగ్ చూసి ముచ్చటపడి

ఇక ఆ సంగతి పక్కన పెడితే పుష్ప ఈ సినిమాలో స్మగ్లింగ్ చేసే అల్లు అర్జున్ ఆ స్మగ్లింగ్ కోసం చేసే ప్లానింగ్, పోలీసుల కంట పడకుండా ఆ ఎర్ర చందనం దుంగలు బోర్డర్ దాటించి సప్లై కానీ విధానం ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఈ ప్లానింగ్ చూసి ముచ్చటపడిన ఓ వ్యక్తి నిజంగా స్మగ్లర్ అవతారం ఎట్టి పుష్ప సినిమా ప్రేరణగా తీసుకుని ప్లాన్ చేశాడట.

పుష్ప చూసి ఇన్స్పైర్ అయి

పుష్ప చూసి ఇన్స్పైర్ అయి

పుష్ప సినిమా చూసి ఇన్స్పైర్ అయిన యాసీన్ ఇనాయతుల్లా అనే స్మగ్లర్ ఒక ట్రక్ లో ఏకంగా 2.45 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను పేర్చి అవి కనపడకుండా పైన కూరగాయల బాక్స్ లతో కప్పేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అలా ఆ లోడు మొత్తాన్ని తీసుకువెళ్లి మహారాష్ట్ర పోలీస్ చెకింగ్ లో దొరికేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకి రాగా అతడు పుష్ప సినిమా చూసి ఇలా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు తెలిపినట్టు తెలిసింది.

Recommended Video

Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
 స్పందించిన సందీప్ కిషన్

స్పందించిన సందీప్ కిషన్


పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మగ్లర్ కర్ణాటక సరిహద్దు దాటాడు. దురదృష్టవశాత్తు సరిహద్దు దాటి మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు. ఇప్పుడు అతని వెనుక ఉన్న నెట్‌వర్క్, వారు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్ వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ విషయం మీద స్పందించిన హీరో సందీప్ కిషన్ ఇది నెక్స్ట్ లీగ్ స్టఫ్ అంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద ఈ పుష్ప స్మగ్లింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X