పూజాభట్‌కు బెదిరింపు ఫోన్‌లు...అరెస్ట్

By Srikanya

ముంబయి: బాలీవుడ్‌ నటి...నిర్మాత పూజాభట్‌కు ఫోన్‌లు చేసి బెదిరింపులు...అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పూణెలో తాము అరెస్టు చేసిన ఆ వ్యక్తి ఒక టెలికాం సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడిపేరు ఆశిష్‌ స్వర్ణాకర్‌(28)అనీ... లాతూర్‌ జిల్లాకు చెందినవాడని తెలిపారు.

అసలు ఏ ఉద్దేశంతో ఆశిష్‌ అలాంటి ఫోన్‌లు చేశాడో ఇంకా నిర్ధారించవలసి ఉందని చెప్పారు. అయితే, కేవలం పూజాభట్‌ను వేధించాలన్న యోచనతోనే అలాంటి ఫోన్‌లు చేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఆశిష్‌ ఇంటి సమీపంలో ఉండే ధృవ్‌ అనే సంగీత దర్శకుడి నుంచి పూజాభట్‌, ఆమె తండ్రి మహేష్‌భట్‌ల వ్యక్తిగత ఫోన్‌నంబర్లను తీసుకున్నాడు. వారిద్దరికీ ఫోన్‌లు చేశాడు.

మహేష్‌భట్‌ ఫోన్‌ తీయలేదు. పూజాభట్‌ ఫోన్‌తీయగానే అసభ్యకరంగా మాట్లాడిన ఆశిష్‌ ఆ వెంటనే ఫోన్‌ ఆపేశాడు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఫోన్‌లుచేసి అసభ్యంగా, బెదిరిస్తున్నట్లుగా మాట్లాడిన ఆశిష్‌ ఎప్పటికప్పుడు వెంటవెంటనే ఫోన్‌లను స్విచాఫ్‌ చేస్తుండటంతో అతడున్న ప్రదేశాన్ని కనుగొనడం కొంత కష్టమైందని పోలీసులు చెప్పారు. అతడు డబ్బుకోసం ఎలాంటి డిమాండ్లూ చేయలేదని కూడా వెల్లడించారు. తనను గుర్తుతెలియని ఎవరో వ్యక్తి అసభ్యకరమైన ఫోన్‌లతో విసిగిస్తున్నాడంటూ పూజాభట్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం పూజాభట్ 'క్యాబరే' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ప్రత్యేక గీతాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పేలా 'క్యాబరే' సినిమా కథ నడుస్తుంది. ఈ చిత్రం తన కెరీర్ లో ప్రత్యేకమైనదని అప్పుడే పబ్లిసిటీ మొదలెట్టిందామె. సినిమా కాన్సెప్టు ఎలా ఉన్నా శృంగారాన్ని లోటు లేకుండా చూసుకుంటుంది అంటున్నారు బాలీవుడ్ జనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X