థియేటర్లు దొరకక సినిమాను వాయిదా వేసారు

By Bojja Kumar

హైదరాబాద్: డిసెంబర్ 5న విడుదలకు సన్నాహమైన 'మన కుర్రాళ్ళే' చిత్రం అనుకున్న విధంగా థియేటర్ల సౌలభ్యం లేకపోవడం వల్ల వాయిదా వేస్తున్నట్టు దర్శక నిర్మాత వీరశంకర్ తెలియజేసారు. ఈ నెలలోనే థియేటర్లు లభించగానే విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.

యువతని అలరించి ఉత్తేజితుల్ని చేసే ఈ చిత్రంలో భారతీయ సినీ చరిత్రలోనే ఎనిమిదిమంది సంగీత దర్శకులు పనిచేయడం మొదటిసారని ఆయన తెలియజేసారు. అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి, ఎం.ఎస్.నారాయణ, కృష్ణుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే అందరిని అలరిస్తున్నాయి.

Mana kurralle Movie Release Postponed

ఆస్రా నిర్మాణ్ ఇండియా సమర్పణలో, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్, రావు రమేష్, కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, బెంగుళూరు పద్మ, వెంకట్, వేణు మాధవ్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం కాగా, చాయాగ్రహణం: ముజీర్ మాలిక్, సంగీతం:రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె, శివకాకాని, మోహన్‌జోనా, భీమాస్, కూర్పు:బస్వా పైడిరెడ్డి, కళ:కె.వి.రమణ, నిర్వహణ:మహేష్ వడ్డి, రాంబాబు కుంపట్ల, సహనిర్మాతలు:గంగ పోలిశెట్టి, సత్యవతి బొరుసు నిర్మాతలు:బి.వి.యస్.శ్రీనివాసు, ఎచ్.ఎస్.అరూన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం:వీరశంకర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X