twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాతకు రూ.10 కోట్ల కుచ్చుటోపి.. మేనేజర్ అరెస్ట్

    |

    ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత ప్రసాద్ వీ పొట్లూరికి చేదు అనుభవం ఎదురైంది. నమ్మిన వ్యక్తే మోసం చేయడం పీవీపీకి షాక్ గురి చేసింది. తన సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో పోలీసులను ఆశ్రయించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఈ వ్యవహారంలో ఏం జరిగిందంటే. .

    పీవీపీకి రూ.10 కోట్ల కుచ్చు టోపి

    పీవీపీకి రూ.10 కోట్ల కుచ్చు టోపి

    మీడియా సమాచారం ప్రకారం.. గత కొద్దికాలంగా తనకు దగ్గరగా ఉండే వ్యక్తి పీవీపీ సంస్థలో మేనేజర్ పని చేస్తున్నాడు. ఆయనను పూర్తిగ నమ్మిన పీవీపీ ఆర్థిక వ్యవహారాలను చూసే బాధ్యతలను అప్పగించారు. అయితే ఆర్థిక వ్యవహారాలపై అనుమానం రావడంతో ఆరా తీస్తే భారీగా మేనేజర్ నొక్కేసినట్టు స్పష్టమైంది అని మీడియాలో కథనాలు వచ్చాయి.

    విజయవాడ పోలీసులకు ఫిర్యాదు

    విజయవాడ పోలీసులకు ఫిర్యాదు

    తన సంస్థలో డబ్బు దుబారా జరిగిందని, భారీగా లెక్కల్లో తేడా వచ్చిందని గ్రహించిన నిర్మాత పీవీపీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.10 కోట్ల మేర తన మేనేజర్ లూటీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అని మీడియా వర్గాలు వెల్లడించాయి.

     మేనేజర్‌ కోసం గాలింపు, అరెస్ట్

    మేనేజర్‌ కోసం గాలింపు, అరెస్ట్

    పీవీపీ ఫిర్యాదు మేరకు మేనేజర్ కోసం పోలీసులు గాలించి చివరకు అదుపులోకి తీసుకొన్నారట. పీవీపీ ఫిర్యాదును ప్రస్తావించగా తన నేరాన్ని ఒప్పుకొన్నట్టు, తిరిగి ఆ మొత్తాన్ని ఇచ్చేస్తానని అంగీకరించినట్టు తెలిసింది. ఈ మేరకు అతడి వద్ద నుంచి డబ్బును రికవరీ చేసే ప్రాసెస్ జరుగుతున్నట్టు సమాచారం.

    భర్త కనిపించడం లేదని ఫిర్యాదు

    భర్త కనిపించడం లేదని ఫిర్యాదు

    ఇదిలా ఉండగా, పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో మేనేజర్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిందని, తన భర్త కనిపించడంలేదని, కొన్ని రోజులు జాడ తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఓ వార్త మీడియాలో ప్రచారమైంది. ప్రస్తుతం మేనేజర్ తన నేరాన్ని ఒప్పుకోవడంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    ఎవరు భారీ సక్సెస్‌తో పీవీపీ

    ఎవరు భారీ సక్సెస్‌తో పీవీపీ

    ఇక పీవీపీ విషయానికి వస్తే.. ఆయన నిర్మించిన ఎవరు చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకొన్నది. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన భారీగా వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో అడివి శేషు, రెజీనా కసండ్రా తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Producer PVP complaints on his manager who cheats Rs.100 crores. He given complaint to Vijayawada police. After complaint they arrrest manager started invesigation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X