కాజల్‌కి అది రావడంతో కలలన్నీ కల్లలైపోయాయి
బాలీవుడ్‌లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవ్‌గన్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా సింఘం సినిమా విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక దక్షిణాది ఫిల్ము షూటింగ్ కొరకు యూరప్ వెళ్ళి తిరిగివచ్చిన ఈ అందాల సుందరిని బిజీ షెడ్యూల్స్ వరించాయి.
ఒకవైపు టీముతో కలిసి సింఘం పబ్లిసిటీ చేయడం మరోవైపు హైదరాబాద్ లో మరో సినిమా షూటింగ్! ఇంటర్వ్యూలు, ఇతర వేడుకలు మొదలైనవాటితో కాజల్ అలిసి పోయి అనారోగ్యం పాలైందని సన్నిహితులు చెపుతున్నారు. సింఘం టీము అందరితో కలిసి ఢిల్లీ వెళ్ళాల్సి వుండగా ఏర్పాట్లన్నీ పూర్తయి, చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా డ్రాప్ అవుట్ అయింది.
ఈ అందాల సుందరికి భరించలేని దగ్గు, జలుబులతో పాటు హై ఫీవర్ వచ్చేసింది. రెండు రోజులపాటు మంచం దిగద్దన్నారట డాక్టర్లు. ఢిల్లీ తనకిష్టమైన నగరమని తాను మొదటి సారిగా నటించిన హిందీ ఫిల్ము పబ్లిసిటీ అక్కడ ఎంతో బాగా చేద్దామనుకున్నానని అయితే దురదృష్టవశాత్తూ చివరి క్షణంలో ఆగిపోయినందుకు చాలా బాధగా వుందని, కాని త్వరలోనే ఆ నగరానికి వెళ్ళాలని కోరుతున్నట్లు తెలిపింది. ఈ సుందరికి ఫీవర్ తగ్గితే చెన్నైలో మరో షూటింగ్ కూడా ఉందట !


Click it and Unblock the Notifications











