twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్ బస్టర్ హిట్ కొడతా: అఖిల్ మనం 100(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అక్కినేని చిన్నోడు అఖిల్ చూడ్డానికి సాఫ్ట్‌గా ఉన్నాడు కానీ....అతడి రియల్ ఆటిట్యూడ్ గమనించిన వారు మాత్రం భవిష్యత్తులో మంచి మాస్ హీరోగా ఎదుగుతాడని అంటున్నారు. ఇటీవల ‘మనం' చిత్రం 100డేస్ ఫంక్షన్లో అఖిల్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి.

    మనం' 100 డేస్ ఫంక్షన్లో అఖల్ మాట్లాడుతూ...నా ఎంట్రీ గురించి అభిమానులకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. బ్లాక్ బస్టర్ సినిమాతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. కొడితే హిట్ కొట్టాలనుకుంటున్నాను. కొడితే అలాంటి ఇలాంటి హిట్ కొట్టాలనుకోవడం లేదు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకుంటున్నాను. ‘ఒక లైలా కోసం' సినిమా విడుదలైన హిట్టయిన తర్వాత నా ఎంట్రీ గురించి విజయవాడలో మీ అందరి ముందుకు వస్తాను, అంత వరకు అభిమానులు ఓపిక పట్టాలి అంటూ వ్యాఖ్యానించారు.

    స్లైడ్ షోలో ‘మనం' 100 డేస్ వేడుక, ‘ఒక లైలా కోసం' ఆడియో వేడుకకు సంబందించిన ఫోటోలు....

    నాగార్జున మాట్లాడుతూ..

    నాగార్జున మాట్లాడుతూ..

    మనం 100 డేస్ ఫంక్షన్ సదర్భంగా నాగార్జున మాట్లాడుతూ...యూఎస్ పోస్టల్ డిపార్టుమెంటు వారు అక్కినేని ఫౌండేషన్ వారి సహకారంతో స్టాంప్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ, స్వామి వివేకానంద, పండిట్ రవిశంకర్, మదర్ థెరిసా తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక సినీ నటుడు ఏఎన్ఆర్ మాత్రమే అన్నారు. అమెరికా వెళ్లినపుడు ఈ స్టాంపులు ఉపయోగించి ఉత్తరాలు రాస్తానని తెలిపారు.

    ఒక లైలా కోసం

    ఒక లైలా కోసం

    నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం' సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ నాన్న గారు ఒకప్పుడు లైలా కోసం వెంట పడితే...రేపు నాగ చైతన్య లైలా కోసం వెంట పడుతున్నారు. నాన్న గారి సాంగ్ పెద్ద హిట్టయినట్లే నాగ చైతన్య సినిమా కూడా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.

    నాగ సుశీల మాట్లాడుతూ...

    నాగ సుశీల మాట్లాడుతూ...

    వృత్తే నా దైవం, అభిమానులే నా బలం అని నమ్మిన వారిలో నాన్నగారు ఒకరు. మాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చారు. మనం నాకు చాలా ఇష్టమైన సినిమా. నాగార్జున, నాగ చైతన్య చాలా బాగా నటించారు. అకిల్ కొద్దసేపే ఉన్నా మంచి ఇంపాక్ట్ చూపించాడని తెలిపారు.

    ఒక లైలా కోసం సినిమా గురించి దర్శకుడు

    ఒక లైలా కోసం సినిమా గురించి దర్శకుడు

    దర్శకుడు విజయ్ కుమార్ కొండ మాట్లాడుతూ...అక్కినేని గారితో మనం సినిమా చేయడం నా అదృష్టం. ఒక లైలా కోసం సినిమా విందు భోజనంల ఉంటుంది. సినిమాలో నాగ చైతన్య బాగా నటించాడు. చివర్లో ఏడిపిస్తాడు అని తెలిపారు.

    English summary
    Manam Movie 100 Days Celebrations event held at Hyderabad. Nagarjuna, Naga Chaitanya, Akhil Akkineni, Ali, Anoop Rubens, Amala, Suma, Diksha Panth, Pooja Hegde and Others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X