మనం: ఆ సీన్ల వల్లనే క్లీన్ సర్టిఫికెట్ రాలేదా?
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'మనం'. ఈ చిత్రం ఈ నెల 23న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ రాక పోవడం చర్చనీయాంశం అయింది.
అక్కినేని కుటుంబ నుండి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అనగానే క్లీన్ 'యు' సర్టిఫికెట్ వస్తుందని అంతా ఊహించడం సహజం. అయితే సినిమాలో మందు కొట్టడం లాంటి సన్నివేశాలు ఉండటం కారణంగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిపికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఇందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని వల్ల సినిమాపై పెద్దగా ప్రభావం ఉండదు అనేది సినీ వర్గాల మాట.

తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించి చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా అక్కినేని ఎప్పటికీ జీవించే ఉంటారని నాగార్జున అంటున్నారు. కాగా...'మనం' చిత్రం ఆడియో ఎలాంటి ఆర్భాటాలు, వేడుక లేకండా డైరెక్టుగా మార్కెట్‌లోకి విడుదల చేసారు. 'మనం' ఆడియో పంక్షన్ గ్రాండ్ గా చేస్తారని,ప్యాన్స్ అంతా వెళ్లవచ్చని భావించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మరణించిన ఇంకా సంవత్సరం కూడా గడవకముందే ఇలాంటి పంక్షన్ జరుపుకోవటం పద్దతి కాదని, తాను స్టేజిపై ఎమోషన్ అయ్యే అవకాసం ఉందని భావించిన నాగార్జున ఫంక్షన్ ని రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











