సెంచరీ క్లబ్బులో ‘మనం’: నాగార్జున ఎమోషన్

By Bojja Kumar

హైదరాబాద్: అక్కినేని మల్టీస్టారర్ మూవీ 'మనం' చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మంచి కథ, కథనం కావడం.... స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా కావడం కూడా సినిమాకు ఆదరణ పెరగడానికి మరో కారణం.

'మనం' సినిమా 100 రోజులు పూర్తయిన సందర్భంగా నాగార్జున్ ఎమోషన అయ్యారు. 'మనం 100 రోజుల రూపంలో ఎఎన్ఆర్ గారు జీవించే ఉన్నారు. ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. మిస్సింగ్ అమ్మా,నాన్న. సినిమాను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు' అంటూ నాగార్జున ట్వీట్ చేసారు.

Manam movie successfully completes 100 days

అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా సినిమా ప్లస్సయింది. ఓవరాల్‍‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా 50 రోజులు పూర్తి కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం ద్వారా అక్కినేని కుటుంబం నుండి మరో యువ హీరో అఖిల్ ఇంట్రడ్యూస్ కావడం సినిమాకు క్లైమాక్స్‌లో హైలెట్‌ అయింది.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X