For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘హలో’ ఇది గమనించారా? నాగార్జున వ్యంగ్యాస్త్రం!

    By Bojja Kumar
    |

    దివంగతులైన టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుతో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ సినిమా ప్రతి తెలుగు ప్రేక్షకుడిని మెప్పించింది. ఏఎన్ఆర్ నటించిన చివరి సినిమా కూడా ఇదే.

    విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సెంటిమెంట్, ఎమోషన్స్, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. ఎంతో అద్భుతంగా ఉన్న, అందరినీ మెప్పించిన ఈ సినిమాకు బంగారు నంది అవార్డు ఖాయమని అంతా భావించారు. కానీ అలా జరుగలేదు.

     ‘హలో' ట్రైలర్‌కు, ‘మనం' నందికి లింకు ఏమిటి?

    ‘హలో' ట్రైలర్‌కు, ‘మనం' నందికి లింకు ఏమిటి?

    ఇటీవల టాలీవుడ్లో నంది అవార్డులపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో.... ‘హలో' ట్రైలర్ ప్రారంభంలో వేసిన కొన్ని కార్డ్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఆ స్లైడ్స్ వేయడం ద్వారా నంది అవార్డులపై నాగార్జున పరోక్షంగా వ్యంగాస్త్రం వదిలారని చర్చించుకుంటున్నారు.

     హలో టీజర్లో వేసిన కార్డ్స్‌లో ఏముంది?

    హలో టీజర్లో వేసిన కార్డ్స్‌లో ఏముంది?

    ‘మనం' సినిమాను మీరు మీ హృదయపూర్వకంగా ఆదరించి అతిపెద్ద అవార్డు అందించారు. మనం మేకర్స్ నుండి వస్తున్న మరో చిత్రం ‘హలో'..... అంటూ థియేట్రికల్ ట్రైలర్లో స్పెషల్ కార్డ్స్ వేశారు. దీన్ని చూసిన చాలా మంది ‘మనం' చిత్రానికి నంది అవార్డు రాని విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

     అవి నాగార్జున క్రియేట్ చేసినవేనంట

    అవి నాగార్జున క్రియేట్ చేసినవేనంట

    ‘హలో' ట్రైలర్ మొదలయ్యే ముందు వేసిన టైటిల్ కార్డ్స్ నాగార్జున కావాలని ప్రత్యేకంగా వేయించినవే అని, ‘మనం' ప్రతి తెలుగు ప్రేక్షకుడి మదిని దోచినప్పటికీ అవార్డుల పరంగా తగిన గుర్తింపు రాలేదనే అసంతృప్తి నాగార్జునలో ఇప్పటికీ ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నంది అవార్డుల వివాదం నడుస్తున్న నేపథ్యంలో నాగార్జున ఇలా ప్రత్యేకంగా కార్డ్స్ వేయించారని అంటున్నారు.

     మైండ్ బ్లోయింగ్: అఖిల్ ‘హలో' ట్రైలర్ కేక... (వీడియో)

    మైండ్ బ్లోయింగ్: అఖిల్ ‘హలో' ట్రైలర్ కేక... (వీడియో)

    అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో' మూవీ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ట్రైలర్ చూసేందుకు క్లిక్ చేయండి.

    మైండ్ బ్లోయింగ్: అఖిల్ ‘హలో' ట్రైలర్ కేక... (వీడియో)

    English summary
    Akkineni Nagarjuna has finally revealed his response in a sarcastically manner about Manam where he has put interesting title cards in the trailer of Hello. The trailer started with a title card, "From the makers of Manam. To which you have awarded your hearts."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X