ఆ స్థానం నాగ చైతన్యకంటే ముందు నాదే: సిద్దార్థ్

తాజాగా మనం సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని హీరో సిద్దార్థ ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మొదట దర్శకుడు విక్రమ్ ఈ సినిమాను అక్కినేని ఫ్యామిలీ కోసం రాయలేదట.

Recommended Video

"Actually The Role Is Mine" Siddrth Says About "Manam" Movie

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించిన చిత్రం... నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం. ఇలా మనం అనే సినిమా ఒక ప్రత్యేకంగా నిలిచి పోయింది. విక్రమ్‌ కుమార్‌... అక్కినేని హీరోలందరినీ ఒకే కథలోకి తెచ్చే ఛాలెంజ్‌ని యాక్సెప్ట్‌ చేసి దానిని సక్సెస్‌ఫుల్‌గా అఛీవ్‌ చేసాడు.

‘మనం’ ఒక స్పెషల్‌ మూవీ

‘మనం’ ఒక స్పెషల్‌ మూవీ

తెలుగు తెర మీదే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన చిత్రాల్లో ‘మనం' ఒక స్పెషల్‌ మూవీ అనిపించుకుంటుంది. అత్యంత క్లిష్టమైన కథాంశాన్ని దర్శకుడు చాలా సింప్లిఫై చేసి.. అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించిన విధానం అందరి ప్రసంసలూ అందుకుంది. అయితే ఇ ఈ సినిమా వచ్చిన ఇన్నాళ్ళకి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు సిద్దార్థ్. పాపం చాలా కాలంగా అసలు టాలీవుడ్ లో కనిపించని సిద్దార్థ్ ఇప్పుడు "మనం" సినిమా మీద నోరు విప్పాడు.

అక్కినేని ఫ్యామిలీ కోసమే అనుకోలేదు

అక్కినేని ఫ్యామిలీ కోసమే అనుకోలేదు

నిజానికి మనం స్టోరీ తయారు చేసేనాటికి విక్రమ్ కుమార్ ఆ కథ అక్కినేని ఫ్యామిలీ కోసమే అనుకుని చెయ్యలేదట, ఆ కథ చాలా చోట్లకి తిరిగి నాగార్జున దగ్గరికి వచ్చింది. అప్పుడు నాగ్ సూచించిన చిన్న చిన్న మార్పులతో అక్కినేని ఫ్యామిలీ సినిమా అయ్యింది. ఎవ్వరూ ఊహించని విధంగా నాగార్జునకి రెండు అనుభవాలని మిగిల్చిన సినిమా అది.

నాగేశ్వర రావు గారి చివరి చిత్రం

నాగేశ్వర రావు గారి చివరి చిత్రం

అక్కినేని నాగేశ్వర రావు గారి చివరి చిత్రం, అదీ తండ్రీ, కొడుకూ, మనవడూ కలిసి చేయటం యాదృచ్చికమే అయినా ఆ సినిమా రావటం అది పూర్తికాగానే లెజెండరీ నటుడు ఏ ఎన్నార్ కన్నుమూయటం ఒక విషాదమైతే, తన కొడుకు ప్రేమించిన అమ్మాయి ఆ సినిమాలో ఇప్పటి నిజజీవిత పాత్రని పోలి ఉండే క్యారెక్టర్ చేయటమూ నాగార్జున ఒక అద్బుతంగానే ఫీలవుతూంటాడు. అయితే ఈ సినిమా నాగార్జున దగ్గరికి రాకముందు జరిగిన కథ వేరు గాఉంది ఆ విషయాలని హీరో సిద్దార్థ్ చెప్పాడు.

 నాగ చైతన్య పాత్ర సిద్దార్థ్ తో

నాగ చైతన్య పాత్ర సిద్దార్థ్ తో

తాజాగా మనం సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని హీరో సిద్దార్థ ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 'మొదట దర్శకుడు విక్రమ్ ఈ సినిమాను కే. విశ్వనాథ్, వెంకటేష్, నన్ను తీసుకొని చేద్దామనుకున్నాడు. నాగేశ్వర రావు గారి ప్లేస్‌లో కే. విశ్వనాథ్, నాగార్జున ప్లేస్‌లో వెంకీని, నాగ చైతన్య పాత్రను నాతో చేయించాలని భావించాడు.

చివరకు అక్కినేని ఫ్యామిలీ వద్దకు

చివరకు అక్కినేని ఫ్యామిలీ వద్దకు

కానీ చివరకు ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీ వద్దకు వచ్చింది' అని చెప్పుకొచ్చాడు సిద్దార్థ. సాధారణంగా పెద్ద సినిమాలంటే వాటి వెనుక ఎన్నో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని తాను కోల్పోయిన అవకాశాన్ని గుర్తుచేసుకున్నాడు సిద్దార్థ. నిజానికి కొన్ని అవకాశాలు, ఇంకొన్ని లోలోపలి భాధలూ ఎలా ఉంటాయో సిద్దార్థ్ ఒక ఉదాహరణ ఇచ్చినట్టే అనుకోవచ్చేమో

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X