‘మనం’ విజయోత్సవంలో అక్కినేని ఫ్యామిలీ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: అక్కినేని మల్టీస్టారర్ మూవీ 'మనం' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువగానే వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అక్కినేని హీరోల సినిమాలకు రాని కలెక్షన్స్ ఈ సినిమా సాధించడం విశేషం.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం' ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించి సినిమాకు హైలెట్ అయ్యాడు. నాగ చైతన్య సరసన సమంత, నాగార్జునకు జోడీగా శ్రియ నటించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని నిర్మించింది.
సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో 'మనం' విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులతో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేసింది.
అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ...
సినిమా విజయం సాధించడం ఆనందకరమైన విషయం. అందుకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరినీ థాంక్స్. 120 రోజులు మేం సినిమా కోసం పడ్డ కష్టం మరిచిపోయామని తెలిపారు.

అఖిల్ గురించి...
అఖిల్‌ను సూపర్‌గా ప్రజెంట్ చేసి పి.ఎస్.వినోద్ క్రెడిట్ కొట్టేసాడు. అనూపర్ రూబెన్స్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. హర్ష వర్దన్ సినిమాలోని ప్రతిమాటను ఆలోచించి రాసాడని నాగార్జున తెలిపారు.

మీడియాకు థాంక్స్
అక్కినేని నాగేశ్వరరావుగారి చివరి చిత్రంగా ఈ సినిమాపై మీడియా సైతం ఎటువంటి నెగెటివ్ వార్తలు చెప్పలేదు. వారే ముందుండి సినిమాని ఘనవిజయం చేసారని నాగార్జున తెలిపారు.

అభిమానుల సంబరాలు
సినిమా విజయవంతం కావడంతో నాన్నగారి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని నాగార్జున తెలిపారు.

అలా బాధ నుండి బయటపడ్డా...
నాన్నగారు దూరమైనప్పుడు ఉన్న బాధ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్ ద్వారా దూరమైంది అని నాగార్జున తెలిపారు.

అక్కినేని వెంకట్ మాట్లాడుతూ..
ఈ సినిమా విడుదలైనప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. సినిమాని చూడాలని ప్రయత్నించాను. కానీ బాధలో సినిమాని పూర్తిగా చూడలేకపోయాను అన్నారు.

ప్రముఖుల హాజరు
మనం విజయోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, చంద్రబోస్, రిలయన్స్ ప్రతినిధి మహేష్ రామనాథన్, మహేశ్వర రెడ్డి, విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

నటీనటులు
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రంలో సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు.

మనం టెక్నీషియన్స్
ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











