శ్రీరామ నవమికి అక్కినేని ఫ్యాన్స్‌కు కానుక!
హైదరాబాద్: శ్రీరామ నవమి(ఏప్రిల్ 8) సందర్భంగా అక్కినేని అభిమానులు కానుక అందుకోబోతున్నారు. అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం అక్కినేని అభిమానులకు ఎంతో ముఖ్యమైన చిత్రం. ఎందుకంటే ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం.
ఈ చిత్రం మే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహించారు.

అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమిది. ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











