For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైరల్ పోస్ట్ :పవన్ మరదలు, ఆయన గురించి ఏం రాసిందో చదవండి

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అభిమానించరు చెప్పండి. ముఖ్యంగా ఆయనతో పాటు పనిచేసినవాళ్లు ఆయన్ని దేముడుగా చూస్తూంటారు. ఇప్పుడు కాటమరాయుడు చిత్రంలో పవన్ కు మరదలు గా చేస్తున్న మానస హిమవర్ష కూడా ఆయనకు వీరాభిమానిగా మారిపోయింది.

  స్వయంగా దగ్గర నుంచి పవన్ సింపుల్ సిటీని చూడటం వల్లనే మరేమో కానీ, ఆయనపై పొగడ్తల వర్షం కురిపించేస్తోంది. ఆయనపై కవితాత్మకంగా ఓ నాలుగు వాక్యాలు రాసి ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే ఆమెకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సామాన్యులా..వరస షేర్స్, లైక్ లతో ఈ పోస్ట్ ని దుమ్ము రేపుతున్నారు. ఇంతకీ ఆమె రాసింది ఏమిటో మీరు ఇక్కడ చూడవచ్చు.

  పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ డాలీ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా 'కాటమరాయుడు'. ఈ సినిమాలో పవన్‌ సరసన మరదలిగా నటి మానస హిమవర్ష నటిస్తోంది. హిమ వర్ష ఇందులో పవన్ ను బాగా టీజ్ చేస్తూ ఏడిపిస్తుందట. సంప్రదాయ బద్దంగా లంగా ఓణీలో అందాలను కనువిందు చేస్తూ పవన్ కు మరదలుగా చేసే అవకాశం రావడంతో మానస ఫుల్ ఖుషీగా ఉందని తెలుస్తోంది.

  అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న ఈ అమ్మడికి ఏకంగా పవన్ సరసన అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉందని మీడియాతో చెప్పింది. పవన్‌ ఇంట్లోనే ఉంటూ పవన్‌ను ఏడిపించే పాత్ర అని అంటోంది. మానస ట్రైన్డ్ డాన్సర్. తను మోడల్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించనుండడంతో మానస చాలా సంతోషంగా ఉంది.

  ఇక ఈ సినిమాలో త‌న‌కు ఎలా ఛాన్స్ వ‌చ్చిందో కూడా మాన‌స తెలిపింది. ఈ కథ కోసం ఆమెను ఎవ్వ‌రూ సంప్ర‌దించ‌కుండానే ఆమెకు ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. నెట్ లో మానస ఫొటోలు చూసిన దర్శకుడు డాలీ... ఎలాంటి ఆడిషన్స్ లేకుండానే పవన్ మరదలి పాత్ర కోసం మానసను సెలక్ట్ చేశాడట.

  ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో పవన్‌, శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, నాలుగొందల మంది డాన్సర్లపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూనే మార్చి 18న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించనున్నారు. ఈ వరుస విశేషాలతో మార్చి నెల మొత్తం పవన్ అభిమానులకు పండుగలా మారనుంది.
  ఈ పాట‌తోనే ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ప్ర‌తీ రెండు రోజుల‌కూ ఓ పాట‌గానీ, మేకింగ్ వీడియో గానీ విడుద‌ల చేస్తారు.

  నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

  English summary
  Manasa Himavarsha is currently working in Pawan Kalyan's Katamarayudu movie. Charmed by Pawan Kalyan's simplicity in real life, Manasa has started writing poetry for him. Apparently a post she wrote on Facebook is now going viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X