Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మనసుకు నచ్చింది’ చేస్తున్న మహేష్ బాబు సోదరి మంజుల!
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో త్వరలో 'మనసుకు నచ్చింది' అనే సినిమా రాబోతోంది. సందీప్ కిషన్, అమైరా దస్తర్, త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ లుక్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ డిసెంబర్ 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మీ మనసుకు కూడా నచ్చుతుందన్న మంజుల
‘మనసుకు నచ్చింది' ప్రీ లుక్ టీజర్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన మంజుల.... ‘నా మనసుకు నచ్చింది, మీ మనసుకు కూడా నచ్చుతుంది' అంటూ ట్వీట్ చేశారు.
టీజర్ అద్భుతంగా ఉంది
'ఫాలో యువర్ హార్ట్' అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఇందులో చూపించిన ప్రకృతి అందాలు సూపర్బ్ అనేలా ఉన్నాయి. జలపాతాలు, సముద్రం కనువిందు చేస్తున్నాయి.
మంజుల భర్త నిర్మాత
ఈ సినిమాను సొంత బేనర్లో రూపొందిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బేనర్లపై మంజుల భర్త సంజయ్ స్వరూప్, జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మహేష్ బాబు సోదరి సంచలన వీడియో: కుటుంబం, నాన్న ఫ్యాన్స్ వల్లే అంటూ....
కొన్ని రోజుల క్రితం ‘మనసుకు నచ్చింది-ఫాలో యువర్ హార్ట్' పేరుతో వీడియో విడుదల చేశారు మంజుల. ఇందులో ఆమె సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఒక అమ్మాయిగా తాను ఎన్నో కలలు కన్నానని, వాటిని నెరవేర్చుకోలేక పోయానని తెలిపారు. ఇపుడు అదే టైటిల్ తో ఆమె సినిమా చేస్తుండటం గమనార్హం.